తెలంగాణ

telangana

ETV Bharat / videos

కోల్​కతాలో నోట్ల వర్షం.. ఎందుకీ అద్భుతం! - KOLKATA

By

Published : Nov 21, 2019, 7:06 AM IST

Updated : Nov 21, 2019, 7:41 AM IST

ఈ దృశ్యాలు చూసి శివాజీ సినిమాలో క్లైమాక్స్​ సన్నివేశం​ అనుకుంటున్నారా..? కాదండి.. నిజంగా డబ్బులు గాల్లో ఎగురుతూ వచ్చి భూమిని తాకాయి. ఈ సంఘటన కోల్​కతా బెన్​టింక్​ వీధిలోని హోక్ మర్చంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ భవనం వద్ద చోటు చేసుకుంది. ఈ సంస్థపై డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) అధికారులు బుధవారం దాడులు చేశారు. వారి రాకను గమనించిన సంస్థ యాజమాన్యం ఆరవ అంతస్తు నుంచి రూ.2000, రూ.500, రూ.100 నోట్లను బయటకు విసిరేశారు.పై నుంచి పడుతున్న నగదును తీసుకోవటానికి ప్రజలు ఎగబడ్డారు.
Last Updated : Nov 21, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details