ఎరక్కపోయి నదిలో ఇరుక్కున్న బావ బామ్మర్ది! - fishing
మధ్యప్రదేశ్ భోపాల్లో భారీ వర్షాలకు కెర్వా నది పొంగిపొర్లుతోంది. శివ, కాంజీ అనే ఇద్దరు బావా బావమరిదులకు చేపలు పట్టాలనిపించి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది మధ్య రాతిపైకి చేరుకున్నారు. చేపలు పట్టడమేమో గానీ గేట్లు ఎత్తేసరికి ఇద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని గంటల తరబడి నిల్చున్నారు. విషయం తెలుకున్న స్థానిక మున్సిపాలిటీ సహాయక బృందం తాడు, నిచ్చెన సాయంతో వారి ప్రాణాలు కాపాడింది.
Last Updated : Sep 27, 2019, 1:26 PM IST