తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​: తుపాకీ పేల్చుతూ మండపంపైకి వధువు! - తుపాకీతో గాల్లోకి కాల్చిన వధువు

By

Published : Jun 1, 2021, 12:31 PM IST

Updated : Jun 1, 2021, 2:23 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ప్రతాప్​గఢ్ జిల్లాలో జరిగిన ఓ వివాహం నెట్టింట వైరల్​గా మారింది. వధువు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఆ తర్వాత వరుడి చేయి పట్టుకుని ఎంతో ఉత్సాహంతో పెళ్లి మండపంపైకి వచ్చింది. వధూవరులను.. అక్కడున్న కుటుంబసభ్యులు, బంధువులు.. కేరింతలు, చప్పట్లతో ఆహ్వానించారు. ఈ ఘటన జెత్వారా పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన క్రమంలో.. వధువు రూపా పాండేపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. ఆమెపై ఆయుధాల చట్టం, సాంక్రమిక వ్యాధి చట్టం కింద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అశోక్ తోమర్ తెలిపారు. అంతేకాక ఆ తుపాకీ లైసెన్సు కూడా రద్దు చేస్తామన్నారు.
Last Updated : Jun 1, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details