Bipin Rawat last rites: రావత్‌కు అమిత్ షా, అజిత్ డోభాల్ నివాళి - బిపిన్ రావత్ అంత్యక్రియలు
Bipin Rawat last rites: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌కు ప్రముఖలు నివాళులర్పించారు. రావత్ దంపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రవిశంకర్, రామ్‌దాస్ అఠవాలే, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సహా పలువురు ప్రముఖులు నివాళలర్పించి, పుష్పాంజలి ఘటించారు. రావత్ సేవలను స్మరించుకున్నారు.