ఇళ్ల మధ్యలోకి వచ్చి ఎలుగుబంటి హల్చల్- జనం హడల్ - ఎలుగుబంటి హల్చల్
రాజస్థాన్ సవాయీ మాధోపుర్ ప్రాంతంలో ఎలుగుబంటి కలకలం రేపింది. సమీప అడవిలో నుంచి నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయపడి ఇళ్లపైకి చేరుకున్నారు. చాలా సేపు అక్కడే సంచరించిన భల్లూకాన్ని.. కొందరు యువకులు తరిమికొట్టారు. దీంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.