పిల్ల కొండముచ్చు కోసం తల్లి విలవిల - కొండముచ్చు మృతి
Baby langur Died: ఉత్తరాఖండ్ గోపేశ్వర్లో.. ఓ పిల్ల కొండముచ్చు మరణంపై ఓ తల్లి స్పందించిన తీరు కంటతడి పెట్టిస్తోంది. అనుకోకుండా ట్రాన్స్ఫార్మర్పై చనిపోయి పడి ఉన్న తన బిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లి అక్కడక్కడే తిరుగుతూ ఉండటం ఓ వీడియోలో కనిపించింది. చివరకు కరెంట్ నిలిచిపోయిన సమయంలో పైకి వెళ్లి నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను గుండెలకు హత్తుకుని పరిగెత్తింది. ఈ బాధాకర సన్నివేశాన్ని చూసి స్థానికులు సైతం కంటతడిపెట్టారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.