పాక్ సైనికులకు భారత జవాన్ల 'ఈద్ ముబారక్' - RAMZAN
ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ సరిహద్దులోని పాకిస్థాన్ సైనికులకు శుభాకాంక్షలు చెప్పారు భారత జవాన్లు. అట్టారీ-వాఘా వద్ద భారత-పాక్ జవాన్లు పరస్పరం మిఠాయిలు పంచుకొని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు ఫుల్బారీ వద్ద బంగ్లా జవాన్లతో స్వీట్లు పంచుకున్నారు జవాన్లు.