పంట పొలాల్లో కూలిన సైనిక విమానం.. పైలట్లు సురక్షితం - కూలిన యుద్ధవిమానం
Army Aircraft Crash: బిహార్‌లో భారత సైన్యానికి చెందిన శిక్షణ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. గయాలోని సైనిక శిక్షణ అకాడమీ నుంచి బయల్దేరిన యుద్ధ విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలినట్లు తెలిపారు. పైలట్లు శిక్షణ తీసుకుంటున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు. జనసమూహాలు లేని ప్రాంతంలో విమానం కూలిపోవడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు. విమానం కూలిపోవడాన్ని గమనించిన స్థానికులు అందులో చిక్కుకున్న పైలట్లను రక్షించారు.