viral video: పులి వేటాడటం ఎప్పుడైనా చూశారా? - పులి వేట లైవ్ వీడియో
మధ్యప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పెంచ్ నేషనల్ పార్క్‌లో ఓ ఆడ పులి వేటాడుతున్న దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సరస్సు ఒడ్డున ఉన్న జింకలు, దుప్పిల గుంపును పులి వేటాడింది. చాలాసేపు సరస్సు ఒడ్డున మాటు వేసిన పులి.. నీటి కోసం జింకల గుంపు రాగానే వాటిపై దాడి చేసింది. రెండు మూడుసార్లు ప్రయత్నించినా వేటలో పులి సఫలం కాలేదు. తర్వాత దట్టమైన అడవిలోకి పులి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను పర్యాటకుడు రోహిత్ డామ్లే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. అవి తెగ వైరల్ అవుతున్నాయి.