200 అడుగుల హైవోల్టేజ్ టవర్‌పైనుంచి జంప్! - జాతీయం వార్తలు తెలుగు
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి జిల్లాలోని వాజిద్పుర్ ప్రాంతంలో ఓ విదేశీయుడు 200 అడుగుల ఎత్తున్న హై వోల్టేజ్ టవర్‌పైకి ఎక్కి ప్యారాచూట్‌తో జంప్ చేశాడు. ప్రాణాంతకమైన ఈ స్టంట్‌ను అక్కడే ఉన్న కొంత మంది తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన గురించి విచారించారు. అతడిని ఇటలీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వాజిద్పుర్లోని తన స్నేహితురాలి ఇంటికి వచ్చిన ఆ విదేశీయుడు.. సరదాగానే ఈ సాహసం చేసినట్లు తెలిపారు.
Last Updated : Feb 29, 2020, 6:13 AM IST