తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ వీడియో: రైల్వే ట్రాక్​పై వృద్ధుడిని కాపాడిన పోలీస్ - దాహిసర్​ రైల్వేస్టేషన్​

By

Published : Jan 2, 2021, 3:03 PM IST

Updated : Jan 2, 2021, 3:15 PM IST

ముంబయి పోలీసులు మరోసారి తమ తెగువను ప్రదర్శించారు. రైల్వే ట్రాక్​పై చిక్కుకున్న 60ఏళ్ల వృద్ధుడిని కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టాడు ఓ కానిస్టేబుల్​. ఓ వైపు నుంచి వస్తున్న రైలును గమనించిన అతను​.. ట్రాక్​ దాటుతున్న వ్యక్తిని ప్లాట్​ఫాం పైకి లాగడం వల్ల తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముంబయిలోని దాహిసర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్​ చూపించిన ధైర్యసాహసానికి నెటిజన్ల నుంచి అభినందనల వెల్లువ లభిస్తోంది.
Last Updated : Jan 2, 2021, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details