శస్త్రచికిత్స చేస్తుంటే హుషారుగా పాటలు పాడింది! - ఫిమోసిస్
శస్త్ర చికిత్స అంటేనే గుండెల్లో అదోరకం గుబులు పుడుతుంది. మరి పిల్లలకు ఎలా ఉంటుంది. ఇంజెక్షన్ అంటేనే భయం పుడుతుంది. ఆసుపత్రి అంటేనే ఆమడదూరం పారిపోతారు చిన్నారులు. కానీ, బంగాల్ బిర్భుమ్ జిల్లాకు చెందిన అనన్యా చక్రవర్తి అనే ఆరేళ్ల చిన్నారి.. తనకు శస్త్ర చికిత్స జరుగుతుంటే ఆపరేషన్ థియేటర్లో ఆనందంగా పాటలు పాడింది. ఫిమోసిస్తో బాధపడుతున్న అనన్య వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్సకు సిద్ధమైంది. ఆపరేషన్ సమయంలో చిన్నారి బెంగాలీ పాటలు పాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Last Updated : Sep 30, 2019, 4:39 PM IST