తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాళ్లు రువ్వుకుంటూ 'ఊరంతా' హోలీ.. 48 మందికి గాయాలు - హోలీలో రాళ్ల దాడులు

By

Published : Mar 19, 2022, 6:03 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Holi celebrations: హోలీ వేడుకలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారం అమలులో ఉంటుంది. రాజస్థాన్​ డూంగర్​పుర్​ జిల్లాలోని భీలూడా గ్రామంలో రాళ్లు రువ్వుకుని హోలీ చేసుకుంటారు. సుమారు 400 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రఘునాథ ఆలయానికి సమీపంలోని మైదానానికి చేరుకున్న గ్రామస్థులు రెండు బృందాలుగా విడిపోయి.. రాళ్లు రువ్వుకుంటారని, ఉదయం నుంచి ఇది మొదలవుతుందని పలువురు తెలిపారు. ఓ వ్యక్తి హత్యకు గురైన క్రమంలో ఆయన చితిపైనే భార్య సజీవదహనమైందని, ప్రతిఏటా గ్రామస్థులు రక్తం చిందించకపోతే గ్రామానికి అరిష్టమని శాపం పెట్టినట్లు చెప్పారు. దీంతో ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా అధికారుల సమక్షంలోనే ఈ వేడుకలు జరగటం గమనార్హం. వైద్య సిబ్బంది, అంబులెన్స్​లను సిద్ధంగా ఉంచుతారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details