తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎందుకు యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడతారు?

ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా యాంటీబయాటిక్స్ పరిష్కరించి ఆరోగ్యాన్నిస్తాయని ఎక్కువ మంది ప్రజలకు ఒక నమ్మకం ఉంది. నిజానికి ఇది అవాస్తవం. ఒక అధ్యయనం ప్రకారం 2000 నుంచి 2015 వరకు యాంటీబయాటిక్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా 39 శాతం పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పెరుగుదల 77 శాతంగా ఉంది.

antibiotics
యాంటీబయాటిక్స్

By

Published : Feb 3, 2021, 4:31 PM IST

Updated : Feb 5, 2021, 3:45 PM IST

యాంటీబయాటిక్స్ వాడకం వల్ల పలు ఆరోగ్య సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చని ప్రజల్లో అపోహ ఉంది. ఆధారం లేని ఈ నమ్మకం వల్ల యాంటీబయాటిక్స్ వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. రోగులు వైద్యం కోసం డాక్టర్లను సంప్రదిస్తే వారు ఇబ్బడి ముబ్బడిగా యాంటీబయాటిక్స్ని సిఫార్సు చేస్తున్నారు.

చిన్న పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇస్తే , వారి శరీరానికి హాని కలుగజేయని, అనేక ప్రయోజనాలను చేకూర్చే సూక్ష్మజీవుల సమూహలను అవి నాశనం చేస్తాయని బయోఎస్సేస్ అనే శాస్త్రీయ పత్రిక తెలిపింది. పెద్దవారిలో అధిక మోతాదులో వీటి వాడకం క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు కారణమౌతుంది.

అమెరికాలోని ప్రముఖ రచయిత మార్టిన్ బ్లేజర్, రట్జర్స్ యూనివర్సిటీ ప్రకారం 2000 నుంచి 2015 వరకు యాంటీబయాటిక్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా 39 శాతం పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పెరుగుదల 77 శాతంగా ఉంది.

అవసరం లేకపోయినా వీటిని వాడటం వల్ల దుర్వినియోగం అవుతుంది. వైద్యశాస్త్రంలో యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ ఒక గొప్ప మలుపు. అయితే వాటి దుర్వినియోగం వల్ల సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్ నిరోధకతను పెంచుకుని మరింత కఠినమైన, చికిత్సకు సాధ్యం కాని జబ్బులను కలుగజేస్తున్నాయి.

ఒక పరిశోధనా బృందం 200ల ప్రామాణిక అధ్యయనాల చేసి యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో వాడకం గురించి పరిశీలనలను ప్రచురించింది. అనేక బాక్టీరియాలు యాంటీబయాటిక్స్ని ఎదుర్కొని శరీరంలో కలుగజేసే నష్టాలను, మంచి బాక్టీరియా దెబ్బతినడం గురించి తెలియజేశారు. అనేక దేశాలలో వైద్యుల సిఫార్సు లేకుండా అంతర్జాలం ద్వారా యాంటీబయాటిక్స్ విపరీతంగా అమ్ముడవుతున్నాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో 60శాతం యాంటీబయాటిక్స్ ఏ విధమైన వైద్యుల సిఫార్సు లేకుండా ముఖ్యంగా వైద్య శిక్షణ లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్నవారి ద్వారా అమ్ముడుపోతున్నాయి.

వైద్యులు యాంటీబయాటిక్స్ శరీరంలోని సూక్ష్మజీవులపై కలుగజేసే దుష్ప్రభావాల గురించి, తద్వారా కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించే విధంగా ప్రవర్తించాలి. వైద్యులు యాంటీబయాటిక్స్ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమాచారాన్ని, లాభ నష్టాలను బేరీజు వేసి ప్రత్యామ్నాయాలను సూచించాలి.

Last Updated : Feb 5, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details