తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ చూపు మసకబారుతోందా?... సమస్య అదే కావొచ్చు.. జాగ్రత్త! - eye drops

ఈరోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ కంటి చూపు మసకబారుతోంది. ఇది చిన్న సమస్యే కదా అని అశ్రద్ధ చేస్తే మనకే ప్రమాదం అని వైద్యులంటున్నారు. సమస్య పరిష్కారానికి పలు సలహాలు ఇస్తున్నారు. మరి ఆ సలహాలేంటో చూద్దామా?

vision blurry
కంటి చూపు మసకబారడం

By

Published : Nov 6, 2022, 7:34 AM IST

'సర్వేంద్రియానాం నయనం ప్రధానం'.. అన్నారు పెద్దలు. కంటి చూపు కోల్పోతే జీవితం అంతా అంధకారమే. కానీ, చాలా మంది ఈ విషయంలో చాలా అశ్రద్ధ వహిస్తారు. ప్రస్తుత యుగంలో కళ్లు మసకబారడం వంటి సమస్య సాధారణమైపోతోంది. అయితే, ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు.

ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం.. ఎక్కడ చూసినా స్మార్ట్ తెరలే... వాటిని చూడకుండా ఉండలేం. ఆఫీసులో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. కంటి ముందు ఏదో ఒక డిజిటల్ తెర తప్పక ఉంటుంది. మొబైల్ ఫోన్స్ స్క్రీన్స్, కంప్యూటర్స్ స్క్రీన్స్ చూడటం వల్ల కూడా కంటి చూపు మసకబారుతుంది. అయితే ఇలాంటి సందర్భాలలో రెప్ప వేయగానే మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు. ఒక్కొక్కసారి కంటిలో ఎలాంటి సమస్యలు లేకపోయినా వస్తువులు రెండుగా కన్పించొచ్చు. వీటితో పాటు కళ్లు పొడిబారటం వల్ల కూడా కంటి చూపు మసకబారుతుంది. ఇలాంటి సందర్భాలలో డాక్టర్ దగ్గరకి వెళ్తే టెస్ట్​లు చేసి ఐ డ్రాప్స్ వాడమని సలహా ఇస్తారు. ఇలా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

ఆ సమస్యల వల్ల కూడా..
ఇవి కాకుండా కొన్ని కంటి సమస్యలుంటాయి. కంటి ఇన్ఫెక్షన్స్, గ్లకోమా, కార్నయల్ అల్సర్స్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కళ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం వంటివి తలెత్తుతాయి. ఇవీకాక కొంతమందిలో రాత్రి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మందిలో రకరకాల రంగులు కన్పించడం జరుగుతుంది. వయసు మళ్లిన వారిలో కూడా కంటి చూపు మందగిస్తుంది. సొరియాసిస్ లాంటి చర్మ సమస్యల్లో కూడా ఈ తరహా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. సాధారణంగా గర్భం దాల్చిన 20 వారాల తర్వాత ఈ తరహా సమస్యలు ఎదురుకావటానికి ఆస్కారం ఉంది. అయితే వీరి కంట్లో మెరుపులు రావడం, మచ్చలు కన్పించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆందోళన, శ్వాసలో ఇబ్బందులు, గుండె ఇష్టం వచ్చినట్లు కొట్టుకోవడం, అకస్మాత్తుగా వాంతులు, బరువు పెరగడం, తలనొప్పి రావడం వంటి సమస్యలు కూడా కంటిపై ప్రభావం చూపుతాయి. కంటిచూపును ఇవి ప్రభావితం చేస్తాయి. అదే విధంగా కొన్ని సందర్భాలలో తీవ్రమైన తలనొప్పి కూడా ఈ తరహా సమస్యలను తెచ్చిపెట్టొచ్చు. కొంత మందికి అయితే పుట్టుకతోనే కంటి సమస్యలు ఉంటాయి. ఏది ఏమైనా ఇలాంటి కంటి సమస్యలు ఎదురైన వెంటనే డాక్టర్​ను సంప్రదించడం మంచిదని నిపుణులంటున్నారు. శరీరంలోని ప్రధాన ఇంద్రియమైన 'కంటి' కోసం వైద్యులు చెబుతున్న మరిన్ని సలహాల కోసం ఈ కింది వీడియో చూడండి.

కంటి చూపు

ఇవీ చదవండి:సన్ స్క్రీన్ లోషన్ వాడితే రాషెస్ వస్తున్నాయా? ఇలా చేయండి!

డెంగీ నుంచి కోలుకోవటానికి బెస్ట్ డైట్ ఇదే

ABOUT THE AUTHOR

...view details