తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహారం అవసరం?  ఏం చేస్తే వాళ్లు ఇష్టంగా తింటారు? - పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్​

పిల్లల చిన్ని బొజ్జలు నింపడం సులువే కానీ ఆరోగ్యకరమైన భోజనంతో నింపడం చాలా కష్టం. అందుకే పిల్లలు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడి తింటారు? వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం రండి.

what type of protein food for children to be healthy
what type of protein food for children to be healthy

By

Published : Oct 17, 2022, 8:50 AM IST

Protein Food For Child: పిల్లల చిన్ని బొజ్జలు నింపడం సులువే కానీ ఆరోగ్యకరమైన భోజనంతో నింపడం చాలా కష్టం. ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహారం అవసరం? ఏం చేస్తే వాళ్లు ఇష్టంగా తింటారు? ఆ వివరాలను తెలుసుకుందాం..

  • ప్రతిరోజూ రాత్రి నానబెట్టిన బాదం పప్పును ఉదయం తినిపించడం వల్ల వారికి సరైన పోషకాలు లభిస్తాయి. జీర్ణవ్యవస్థ బాగుండడంతో పాటు రోగనిరోధక శక్తి మెరుగువుతుంది.
  • ఉడికించిన కోడిగుడ్డు పిల్లలకు ఎంతో శక్తినిస్తుంది. దీంతో వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
  • కొంతమంది తల్లులు రోజు ఇంట్లో ఏం వండుతారో ఆ ఆహారాన్నే పిల్లలకు తినిపిస్తుంటారు. అయితే చిన్నారుల ఆహార విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. పెద్దవాళ్లు కాస్త కారంగా ఉన్నాసరే తిని జీర్ణం చేసుకుంటారు. కానీ పిల్లలు అలా కాదు. వాళ్లకి కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని పెట్టకుండా ఉండటమే ఉత్తమం.
  • కాల్షియం, ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు అందించడం వల్ల వారి దేహదారుఢ్యానికి మంచిది.
  • పిల్లలకు రోజుకో ఫలాన్ని తినిపించాలి. స్నాక్స్‌బాక్స్‌లో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు కాకుండా రోజుకో పండు ఉంచాలి. వీలైతే ఆ ఫలాలను అందమైన బొమ్మల తీరుగా కట్‌ చేసి పిల్లలకు అందించాలి. దీంతో వాళ్లు ఆడుతూ పాడుతూ తినేస్తారు. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
  • కొంతమంది పిల్లలు పాలు తాగేందుకు ఇష్టపడరు. తాగడం లేదని సరిపెట్టుకుని ఊరుకోకూడదు. మెల్లగా వాళ్లకు పాలు, పెరుగు, నెయ్యి తినే విధంగా అలవాటు చేయాలి. పాలతో ఎన్నో రకాల వంటకాలు చేయవచ్చు. ఎలా చేస్తే వాళ్లు ఇష్టంగా తింటారో వాటిని వండి వాళ్లకి తినిపించాలి.
  • పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తిని జీర్ణం చేసుకోలేరు. అందువల్ల వాళ్లకి ఏ ఆహారం తినిపించాలన్నా కొద్ది కొద్దిగా మొదలు పెట్టాలి. వాళ్లు ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారో గమనించాలి.
  • పిల్లలు పెరిగే కొద్దీ జంక్‌ ఫుడ్‌ తినేందుకు అలవాటు పడతారు. ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. జంక్‌ ఫుడ్‌ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. పిల్లలు, పెద్దలూ జంక్‌ ఫుడ్‌కు ఎంత దూరం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు.
  • ఇవీ చదవండి:
  • 6-12 ఏళ్ల పిల్లలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
  • రోజంతా యాక్టివ్​గా ఉండాలనుకుంటున్నారా?.. వీటిని తినేయండి మరి!

ABOUT THE AUTHOR

...view details