తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పాలిచ్చే తల్లులు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? - etv bharat health

తల్లి అవ్వగానే ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన అమ్మమ్మలు, అమ్మలు చెబుతూనే ఉంటారు. తల్లి తీసుకునే ఆహారమే శిశువు ఎదుగుదలను నిర్ధేశిస్తుంది. మరి ఆ సమయంలో తల్లి పాల నాణ్యత, ఉత్పత్తి పెంచుకోడానికి అమ్మలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం...

what-to-eat-when-you-are-breastfeeding
పాలిచ్చే తల్లులు.. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు?

By

Published : Aug 9, 2020, 10:32 AM IST

భిన్న సంప్రదాయాల మిళితం భారత దేశం. జీవనశైలి నుంచి ఆహారం దాకా.. దేశవ్యాప్తంగా ఎన్నో తేడాలుంటాయి. ఎన్ని ఉన్నా.. తల్లి అయ్యాక సరైన మోతాదులో పోషకాలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నాయి అన్ని ఆచార, సంప్రదాయాలు. మరి పాలిచ్చే అమ్మలు ఏం తినాలనే విషయంపై మన పోషకాహార నిపుణురాలు దివ్యా గుప్తా ఏం చెబుతున్నారో చూసేయండి..

పాలిచ్చే తల్లులు.. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు?

చనుబాలే ఎందుకు?

తొలి ఆరు నెలలు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలంటోంది డబ్ల్యూహెచ్ఓ. మరో రెండేళ్లు ఇతర ఆహారాలతో పాటు చనుబాలు అందించాలంటోంది. ఎందుకంటే..

  • తల్లిపాలే పిల్లల పెరుగుదల, ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతాయి. చనుబాలతోనే శిశువులో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • తల్లిపాలు తాగే బిడ్డలు భవిష్యత్తులో ఆస్తమా, కొలెస్ట్రాల్ వంటి రోగాల బారినపడే అవకాశాలు చాలా తక్కువ.
  • చనుబాలలో లాక్టోస్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఎంజైమ్స్, చక్కెర శాతం సమపాలల్లో ఉంటాయి.
  • త్వరగా జీర్ణమవుతాయి. దీంతో శిశువుకు మలబద్ధకం సమస్య ఉండదు.
  • తల్లిపాల తాగే నవజాత శిశు మరణాలు చాలా తక్కువ.
  • తల్లి పాలు పట్టే సమయంలో.. బిడ్డ నోటికి వ్యాయమం అవుతుంది. దీంతో పళ్లు సరైన క్రమంలో వచ్చేందుకు దోహదపడుతుంది.
  • చనుబాలు ఆహారంగా తీసుకునే పిల్లల్లో బాల్య మధుమేహ సమస్యలుండవు.
  • అంతే కాదు, బిడ్డకు స్తన పాలను పట్టించడం వల్ల గర్భం దాల్చినప్పుడు పెరిగిన ఉదరభాగం తగ్గుతుంది.
  • ఛాతీ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు నుంచి చనుబాలు పట్టే ప్రక్రియ కాపాడుతుంది.
పాలిచ్చే తల్లులు.. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు?

అమ్మ ఆహారమే బిడ్డకు ఔషధం..

గర్భం దాల్చినప్పటి నుంచి తల్లి తీసుకునే ఆహారంపైనే చనుబాల ఉత్పత్తి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఎన్నో లాభాలనిచ్చే చనుబాలు ఆరోగ్యకరంగా, పౌష్టికంగా ఉండాలంటే తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

  • సాధారణ సమయంలో శరీరానికి రోజూ కావల్సిన క్యాలరీల కంటే గర్భం దాల్చాక దాదాపు 500-600 క్యాలరీల ఆహారం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సంఖ్య అధిక బరువు, తక్కువ బరువుతో బాధపడేవారిలో వేరుగా ఉంటుంది.
  • వైద్యులు సిఫార్సు చేసేదాని ప్రకారం.. రోజుకు 74 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అందుకోసం పప్పులు, చిరుధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు, సోయా ఉత్పత్తులు, చికెన్, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి.
  • చక్కెర శాతం అధికంగా ఉండే చిప్స్, కేకులు, కూల్ డ్రింక్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. వాటి స్థానంలో కొబ్బరి నీళ్లు, పండ్లు/కూరగాయల రసాలు, మజ్జిగ, లస్సీ వంటివి తీసుకుంటే చనుబాలు ఎంతో పౌష్టికంగా ఉత్పత్తి అవుతాయి.
  • పాలిచ్చే తల్లులు రోజుకు కనీసం 10-15 గ్లాసుల నీళ్లు తాగాలి. ఎందుకంటే తల్లిపాలు ద్రవపదార్థం. మరి చనుబాలు సాఫీగా పిల్లలకు అందాలంటే నీరు ఎక్కువ తాగాల్సిందే.
  • ఆరోగ్యకరమైన కొవ్వులను రోజూ తీసుకోవాలి. అంటే, అవకాడో, గింజలు, పప్పు గింజలు వంటివన్నమాట.
  • ఆల్కాహాల్, సిగరెట్లు తాగే అలవాటుంటే చనుబాలు పట్టించే కాలంలో అవి మానేయాల్సిందే. లేకపోతే శిశువుకు ప్రమాదం.
  • ఈ సమయంలో తిండి మానేసి డైటింగ్​, ఉపవాసలు వంటివి చేయకూడదు. కావాలంటే సున్నితమైన వ్యాయామాలు చేసుకోవచ్చు.
  • ఐరన్, కాల్షియం, జింక్, సిలేనియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలు, కాయ ధాన్యాలు, ఎండు ద్రాక్షలు వంటివి తీసుకోవాలి. కాల్షియం కోసం పాల ఉత్పత్తులు, ఆకు పచ్చ రంగులో ఉండే కూరగాయలు తినాలి.
  • స్తన్యవృద్ధికి సహకరించే ఆహారం, మూలికలు, ఔషధాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వాటిలో బార్లీ, జీలకర్ర, మెంతులు, గింజ పప్పులు, పాల పదార్థాలు, ఓట్స్, గార్డెన్ క్రెస్ విత్తనాలు తీసుకోవడం మర్చిపోకూడనివి.

ఇదీ చదవండి: 'కాఫీ'తో మీ వయసు దాచేయండిలా!

ABOUT THE AUTHOR

...view details