తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎంఆర్​ఐ స్కానింగ్​తో సైడ్​ ఎఫెక్ట్స్ ​వస్తాయా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? - ఎంఆర్​ఐ స్కానింగ్​ ఎఫైక్ట్స్​

MRI Scan Effects: సాధారణంగా మన శరీరం లోపల ఏదైనా సమస్య ఉన్నా, దెబ్బలు తగిలినా తప్పనిసరిగా స్కానింగ్​ తీయాల్సి వస్తుంది. అయితే.. ఎంఆర్​ఐ స్కానింగ్​తో సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయని చాలా మందిలో అపోహ ఉంటుంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారో చూద్దాం.

What are The Negative Effects of an MRI
What are The Negative Effects of an MRI

By

Published : Jul 1, 2022, 7:02 AM IST

MRI Scan Effects: మనం బైక్​ మీద నుంచి కిందపడిపోయినప్పుడో.. ప్రమాదాలు జరిగినప్పుడో.. ఒంటిలోపల దెబ్బలు తగిలాయో తెలుసుకునేందుకు స్కానింగ్​ లాంటివి తీయాల్సి ఉంటుంది. కాళ్లు, తల, నడుం నొప్పులు, తిమ్మిర్లు.. ఎక్కువైనా స్కానింగ్​ చేయించుకుంటే సమస్య తెలుస్తుందని వైద్యులు చెబుతుంటారు. స్కానింగ్​లో చాలా రకాలే ఉంటాయి. ముఖ్యంగా ఎంఆర్​ఐ స్కానింగ్​లోని రేడియేషన్​.. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చాలా మంది భయపడుతుంటారు.

అయితే.. దీనిపై మాట్లాడిన వైద్యులు మాత్రం సైడ్​ ఎఫెక్ట్స్​ ఏం ఉండవని స్పష్టం చేస్తున్నారు. అది మూసి ఉన్న గదిలో నిర్వహించడం వల్ల ఓ ఫోబియాలా ఉంటుందని అంటున్నారు. స్టీల్​, మెటల్​ వస్తువులు శరీరంపై ఉంటే.. తీసేయమని మాత్రమే చెబుతారని వివరించారు ప్రముఖ న్యూరోసర్జన్​ డా. వంశీ కృష్ణ.

ఎంఆర్​ఐ స్కానింగ్​తో సైడ్​ ఎఫెక్ట్స్ ​వస్తాయా?

''చేతులు, కాళ్ల తిమ్మిర్లు.. మెడలో నొప్పి.. నడుములో నరాల ఒత్తిడి, వణుకు వంటివి కామన్​. దీనికి షుగర్​ కూడా ఒక కారణం కావొచ్చు. కానీ ఎంఆర్​ఐ స్కానింగ్​ చేయించుకుంటే సమస్య తెలుస్తుంది. చాలా మందికి ఎంఆర్​ఐతో రేడియేషన్​ ఉంటుందని భయం. ఉదాహరణకు తల స్కానింగ్​ అప్పుడు.. ఎంఆర్​ఐ మిషన్​ లోపలకు వెళ్లాక సౌండ్​కు భయపడుతుంటారు. దీనిని క్లోజ్డ్​ ఫోబియా అంటారు. స్టీల్​, మెటల్స్​ ఒంటిపైన ఏమన్నా ఉంటే తీయాలి అంతే. ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి. రేడియాలజీలో అడ్వాన్స్డ్​ మెథడ్స్​ ఓపెన్​ ఎంఆర్​ఐ, ఇంకా మ్యూజిక్​ ప్లే చేస్తూ స్కానింగ్​ తీయడం వంటివి ఉన్నాయి. అయినా.. ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండవు. ఫ్యూచర్​లో ఏదైనా సమస్య వస్తే.. పోల్చి చూసేందుకు ఈ ఎంఆర్​ఐలు ఉపయోగపడతాయి.''

- డా. వంశీ కృష్ణ, న్యూరోసర్జన్​

కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వంటివి మెడికేషన్​తో తగ్గిపోతాయని చెబుతున్నారు డా. వంశీ కృష్ణ. విటమిన్​ బీ12 తక్కువున్నా ఇలాంటివి రావొచ్చని.. దానికి తగ్గట్లు మందులు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఒకవేళ స్కానింగ్​ తర్వాత కూడా మెడలో, నడుములో, శరీరంలోని ఏదైనా భాగంలో ఒత్తిడి ఉంటే.. మెడికేషన్​ మేలని అంటున్నారు. వీటి వల్ల ఫలితం లేకుంటే.. ప్రత్యామ్నాయాలు ఉంటాయని సెలవిచ్చారు.

ఇవీ చూడండి:జుట్టు రాలుతోందని బాధ వద్దు! ఈ కొత్త ట్రీట్​మెంట్​తో..

వక్షోజాలు చిన్నగా ఉంటే ఇబ్బందా? పిల్లలకు పాలు సరిపోవా? డాక్టర్ జవాబులు ఇవీ..

ABOUT THE AUTHOR

...view details