రోజూ వ్యాయామం చేయటానికి కొందరికి సమయం దొరకదు. దీంతో చాలామంది వారాంత సెలవుదినాల్లో ఒకేసారి తీవ్రంగా వ్యాయామాలు చేసేస్తుంటారు. ఇలాంటి 'వారాంత యోధులకు' కండరాలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. అందుకే రెండు మూడు రోజుల వరకు నొప్పులతో సతమతమవుతుంటారు. అయినప్పటికీ వీరికి వ్యాయామం వల్ల ఒనగూడే ప్రయోజనాలూ బాగానే లభిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.
ఒకట్రెండు సార్లే అయినా వారానికి కనీసం 75 నిమిషాలు, ఒక మాదిరిగా 150 నిమిషాలు వ్యాయామాలు చేసేవారి ఆయుష్షు పెరుగుతున్నట్టు వెల్లడి కావటం విశేషం. అంతగా వ్యాయామాలు చేయనివారితో పోలిస్తే ఇలాంటి వారాంత యోధులకు ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 30% తగ్గుముఖం పడుతోంది. గుండెజబ్బుతో సంభవించే మరణం ముప్పు 40%, క్యాన్సర్‌తో తలెత్తే మరణం ముప్పు 18% తగ్గుతోంది.