Vitamin E Health Benefits In Telugu :ప్రస్తుత కాలంలో వాతావరణంలో భారీగా మార్పులు సంభవిస్తున్నాయి. కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలూ రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రజల లైఫ్ స్టైల్లోనూ మార్పులొచ్చాయి. ఇదంతా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా జుట్టు, చర్మానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విటమిన్-ఇ ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. నిత్యం విటమిన్-ఇ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి కలిగే లాభాలు..
Vitamin E Benefits For Skin :చర్మం ఆరోగ్యవంతంగా ఉండేందుకు విటమిన్-ఇ తోడ్పడుతుంది. సోలార్ రేడియేషన్ ద్వారా వచ్చే రాడికల్ స్కావెంజర్ నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. అందుకే చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లలో-ఇ విటమిన్ను విరివిగా ఉపయోగిస్తారు. నిత్యం ఏదో విధంగా విటమిన్-ఇ తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుందని వైద్యనిపుణలు చెబుతున్నారు. దాంతోపాటు వయస్సు మీద పడటం ద్వారా వచ్చే ముడుతలు, మచ్చలు రాకుండా చేయవచ్చని వారు అంటున్నారు. అదేవిధంగా చర్మంపై వచ్చే వాపు, చికాకు నుంచి ఇ విటమిన్ ఉపశమనం కలిగిస్తుందని వెల్లడిస్తున్నారు.
జుట్టుకు కలిగే లాభాలు..
Vitamin E Benefits For Hair :జుట్టు ఎదుగుదలకు విటమిన్-ఇ ఎంతగానో సాయపడుతుంది. జుట్టుకు ఆక్సిజన్, రక్తాన్ని సమృద్ధిగా అందించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. డాండ్రఫ్ సమస్య నుంచి చాలా వరకు విముక్తి కలిగిస్తుంది. తలపై ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు తోడ్పడుతుంది. జుట్టును పొడిబారకుండా చేస్తుంది. జుట్టు నిగారింపు పెంచేందుకు, దృఢంగా ఉండేందుకు విటమిన్-ఇ దోహదపడుతుంది.
విటమిన్-ఇ ఎక్కువగా ఉండే పదార్థాలు..
Vitamin E Rich Foods :విత్తనాలు, హాజెల్ నట్స్, వేరుశనగ, పైన్ గింజలు, బాదంలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా.. పొద్దుతిరుగుడు నూనె, బచ్చలికూర, మామిడి, బొప్పాయి, కివీస్ పండ్లతో పాటు బ్రౌన్ రైస్, బార్లీలోనూ విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీరానికి విటమిన్-ఇ రాయడం..
Vitamin E Topical Application : అయితే విటమిన్ 'ఇ'ని కేవలం ఆహారం రూపంలోనే కాకుండా.. శరీరానికి సైతం పూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొడిబారిన చర్మానికి విటమిన్-ఇ పూయాలని వారు వెల్లడిస్తున్నారు. తలకు రాసుకుంటే దృఢమైన నిగారింపు జుట్టును సొంతం చేసుకోవచ్చని వారు అంటున్నారు.