తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

భారత్​ నుంచే కరోనాకు తొలి హోమియో టీకా! - హోమియోపతి లో కోవిడ్ టీకా

కొవిడ్ పోరులో హోమియో కూడా చేరింది. హోమియోపతి కొవిడ్ టీకా (నొసోడ్) ప్రపంచంలో మొదటి సారిగా భారత్ లోనే రూపొందింది. దీనిపై పరీక్షలు కూడా జరిగాయి. కొవిడ్ వచ్చిన వారిలో లక్షణాలు తగ్గించటంలో, రోగ నిరోధకారిగా, మనసుకు సాంత్వననిచ్చే ఔషధంగా దీనికి 62% ప్రభావం ఉన్నట్టు తేలింది.

Vaccines and Homeopathic nosodes
హోమియోపతి కోవిడ్ టీకా..!

By

Published : Apr 15, 2021, 12:38 PM IST

హోమియోపతిలో టీకాలు ఉంటాయా? ఈ ప్రశ్నను అర్థం చేసుకోవటానికి టీకా అంటే ఏమిటో తెలుసుకోవాలి. టీకా వ్యక్తికి సహజంగా ఉన్న రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఒక నిర్ధిష్ట వ్యాధి నుండి రక్షణ కల్పించాలని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది. మరి హోమియో ఔషధం టీకా అవుతుందా?

ముంబయి నగరంలో లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా అధిపతి, పరిశోధకులు డా. రాజేశ్​ షా గత రెండు దశాబ్దాల్లో కొన్ని హోమియోపతి ఔషధాలను, రెండు టీకాలను అభివృద్ధి చేశారు. హోమియోపతి కొవిడ్-19 టీకానూ ఈయన రూపొందించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి దీని సురక్షతను, ప్రభావాన్ని అంచనా వేశారు. గత 150 సంవత్సరాలుగా బ్యాక్టీరియా, వైరస్​లను ఉపయోగించి హోమియోపతి టీకాలు తయారుచేస్తున్నారు పరిశోధకులు.

ఈ మధ్య కాలంలో ఇన్​ఫ్లూయంజా, లెప్టోస్పైరోసిస్, డెంగ్యూ మొదలైన వైరస్​ల నుంచి హోమియో టీకాలను (నొసోడ్లు) తయారుచేసి వాటి ప్రభావాన్ని పరిశీలించారు. బ్రెజిల్, క్యూబా దేశాల్లో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం డెంగ్యూ, ఇన్​ఫ్లూయంజా లాంటి జబ్బులు విస్తరిస్తున్నపుడు హోమియో టీకాలు చెప్పుకోదగ్గ రక్షణ కల్పించాయి.

భారత్ నుంచే హోమియో కొవిడ్ టీకా

చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో హోమియోపతి వైద్యులు కొవిడ్-19 టీకా గురించి పరిశోధన ప్రారంభించారు. డా. రాజేశ్​ షా.. కొందరు శాస్త్రవేత్తలతో కలిసి మార్చి 2020 నుంచే ఈ దిశగా పరిశోధన ప్రారంభించారు. ముంబయి నగరంలో హాఫ్ కిన్ ఇన్​స్టిట్యూట్​, గుజరాత్ విశ్వవిద్యాలయం సహకారంతో మూడు రకాల కొవిడ్ టీకాలను రూపొందించారు. ఓ.ఇ.సి.డి. ప్రమాణాలతో ఈ టీకాలను జంతువులపై ప్రయోగించారు. తరువాత తగు జాగ్రత్తలు తీసుకుని మొదటి దశ ప్రయోగాలను మనుషులపై జరిపారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. కొవిడ్ వ్యాధికి వ్యతిరేకంగా ప్రభావాన్ని చూపినట్టు కొన్ని బయోమార్కర్లను గుర్తించారు.

హోమియోపతి కోవిడ్ టీకా..!

ముంబయి మహానగర పురపాలిక నిర్వహించే క్వారంటైన్ కేంద్రంలో పరిశోధనా ప్రయోగాలు నిర్వహించి 62% రక్షణ కల్పించేదిగా ఉందని నిర్ధరించారు. ఈ ఆవిష్కరణ ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిన శాస్త్రీయ హోమియో టీకా అయింది.

హోమియో టీకాను ప్రయోగాత్మకంగా వాడుతూ కరోనా రోగులతో సమీప సంబంధం ఉన్న చాలా మందికి ఈ టీకా వ్యాధిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించినట్టు గమనించారు. వ్యాధి నిరోధకంగానే కాక, కొవిడ్ వచ్చిన వారిలోనూ లక్షణాలను, వ్యాధి తీవ్రతను తగ్గించటంలో ఈ టీకా సత్ఫలితాలను చూపింది. ప్రజలందరికీ ఈ టీకాను అందించటానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details