తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

యాంటీబాడీ పరీక్ష మేలేనా? కాదా..? - కరోనా సమాచారం

కరోనా వైరస్‌ యాంటీబాడీలుంటే మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాదని, అందుకే యాంటీబాడీ పరీక్ష చేయించుకోవటం మంచిదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. అందరికీ ఉపయోగపడేదీ కాదు. యాంటిబాడీ పరీక్షతో మేలేనా తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

uses of antibody test
యాంటీబాడీ పరీక్ష మేలేనా? కాదా..?

By

Published : Jul 21, 2020, 8:50 PM IST

ఎంతమంది కరోనా బారినపడ్డారనేది తెలుసుకోవటానికి యాంటీబాడీ పరీక్షలు ప్రభుత్వాలకు, విధాన కర్తలకు తోడ్పడతాయి గానీ వ్యక్తులకు పెద్దగా ఉపయోగపడవనే చెప్పుకోవాలి. పరీక్షలో కరోనా యాంటీబాడీలు బయటపడితే అప్పటికే ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు నిర్ధారణ కావటం నిజమే. తిరిగి ఎన్నడూ ఇన్‌ఫెక్షన్‌ రాదని, ఎక్కడికైనా వెళ్లొచ్చని అనుకోవటం మాత్రం తప్పు. గతంలో దాడి చేసిన కరోనా వైరస్‌ల విషయంలో తొలిసారి ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డాక ఆరు నెలల వరకు వాటి యాంటీబాడీలు రక్తంలో ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కొత్త కరోనాకు నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందన్నది కచ్చితంగా తెలియదు.

సుమారు 2 నెలల వరకు ఉండొచ్చని అంచనా. అందువల్ల యాంటీబాడీలు ఉన్నట్టు తేలినా విచ్చలవిడిగా తిరగటం తగదు. తిరిగి వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదు. పైగా అన్నిసార్లూ యాంటీబాడీ పరీక్షలు నిజం కావాలని లేదు. సుమారు 30% మందిలో తప్పుడు ఫలితాలు వస్తున్నట్టు బ్రిటన్‌ అనుభవాలు పేర్కొంటున్నాయి. అంటే ఇన్‌ఫెక్షన్‌కు గురైనా వైరస్‌ సోకలేదనే తేలుతోందన్నమాట. ఇక 2% మందిలో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకపోయినా వైరస్‌ దాడి చేసినట్టు బయటపడుతోంది. కాబట్టి గతంలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డా, పడకపోయినా ఎవరి జాగ్రత్తలో వారుండటమే ఉత్తమం.

ఇవీ చూడండి: దేవాదాయ నిధులను అమ్మఒడికి ఎలా మళ్లిస్తారు?: కన్నా

ABOUT THE AUTHOR

...view details