తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కడుపులో గడబిడా... దూరం చేద్దామిలా...!

ఈకాలంలో దగ్గూ, జలుబులతోపాటు ఎక్కువమందిని ఇబ్బంది పెట్టే సమస్య నీళ్ల విరేచనాలు. వీటి వల్ల శరీరం నీరు, ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. ఓఆర్‌ఎస్‌తోపాటూ ఇంకేం తీసుకోవచ్చంటే...

Tips to reduce watery diarrhea in telugu
కడుపులో గడబిడా... దూరం చేద్దామిలా...!

By

Published : Jul 22, 2020, 10:39 AM IST

మెంతులు

మజ్జిగలో కాసిన్ని మెంతులు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.

పెరుగు:

దీనిలో ఉండే బ్యాక్టీరియా పొట్ట సమస్యలను తగ్గించడానికి సాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

వాము:

ఇది నీళ్ల విరేచనాలను తగ్గించడానికి ఎంతగానో సాయపడుతుంది. అంతేకాదు కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌నూ నియంత్రిస్తుంది. వేడినీళ్లలో కాస్త వాము వేసుకుని తాగితే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది.

మంచినీళ్లు:

కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగాలి. ఆ నీటిలో కాస్త పంచదార, చిటికెడు ఉప్పు వేసి తరచుగా తీసుకుంటే శరీరానికి శక్తి అంది నీరసం తగ్గుతుంది.

అన్నం:

అన్నంలో పెరుగు, కొంచె పంచదార, కాస్త నిమ్మరసం వేసుకుని తినడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

అటుకులు:

వీటిని ఉడికించి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, చిటికెడు పంచదార కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details