Tips For Glow Skin At Home :చర్మ సౌందర్యంపై ఎక్కువమంది శ్రద్ద చూపుతూ ఉంటారు. కానీ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, గాలి కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు.. మన చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతాయి. వాతావరణ కాలుష్యంతో పాటు జంక్ ఫుడ్ వంటివి తినడం వల్ల చర్మం పాడవుతూ ఉంటుంది. చర్మంపై మచ్చలు రావడం, ముడతలు పడటం, మొటిమలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం అందవికారంగా కనిపించడం వల్ల నలుగురిలో కలిసి తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది.
చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేసుకునేందుకు చాలామంది మార్కెట్‌లో దొరికే కెమికల్స్‌తో తయారుచేసిన క్రీములు, సబ్బులు, ఫేష్‌వాష్‌లు వంటివి వాడుతూ ఉంటారు. కానీ కెమికల్స్ ఉపయోగించి తయారుచేసిన క్రీముల వల్ల ముఖానికి హాని కలిగే అవకాశముంటుంది. అలా కాకుండా ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో ముఖం ప్రకాశవంతంగా వెలిగేలా చేసుకోవచ్చు. అవేంటో ఇందులో చూద్దాం.
Skin Care Tips : ఇంట్లో వంటల్లో మనం రోజూ వాడే కొన్ని పదార్థాలు కూరకు రుచి ఇవ్వడమే కాకుండా మన శరీర సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల శరీరానికి ఎలాంటి నష్టం జరగడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా పసుపు, పెరుగు, శనగపిండి వంటివి చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చడంలో చాలా సహాయపడతాయి. వీటిల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి.
పసుపుతో చర్మ సౌందర్యం..
Skin Care Turmeric : పసుపులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. రోగ నిరోధక కారకాలు కలిగి ఉన్న పసుపులో చర్మానికి మేలు చేసే గుణాలు కూడా చాలానే ఉంటాయి. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే బ్యాక్టీరియాను నాశనం చేసి చర్మ సౌందర్యానికి సహాయపడతాయి. ఇక పసుపులో యాంటీ ఇనఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మడతలు, మచ్చలను తొలగించి చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.
శనగపిండితో లాభాలు..
Skin Care Besan Powder : శెనగపిండిలో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు ఉంటాయి. శనగపిండిని ఆహారంలో భాగం చేసుకుని తీసుకుంటే చర్మంపై ఉండే చనిపోయిన సెల్స్‌ను తొలగిస్తుంది. అలాగే ఆయిలీ స్కిన్‌తో బాధపడేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆయిల్‌ను పూర్తిగా తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
పెరుగు తీసుకుంటున్నారా..?
Skin Care Curd : పెరుగులో చర్మ సౌందర్యాన్ని పెంచే చాలా పదార్థాలు ఉన్నాయి. పెరుగులో ఉండే లాక్ట్రిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే చనిపోయిన కణాలను తొలగించి చర్మం ప్రకాశంతంగా మెరవడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం పగిలిపోకుండా కాపాడుతుంది. దీంతో పాటు చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా కూడా పెరుగులో ఉండే గుణాలు కాపాడతాయి. రోజూ పెరుగు తీసుకుంటే ముఖం ఎప్పుడూ తాజాగా మెరుస్తూ ఉంటుంది.
పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.