Stress Relieving Foods: ఇటీవల కాలంలో చాలా మంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలో ఈ సమస్య తలెత్తుతోంది. స్ట్రెస్ అనిపిస్తే చాలు.. కొందరు టీ, కాఫీ తాగుతుంటారు. ఇంకొంతమంది మెడిటేషన్ చేస్తుంటారు. అయితే వీటి కన్నా కొన్ని ఆహార పదార్ధాలు తీసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే
ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ సూపర్ ఫుడ్స్‌తో చెక్ పెట్టేయండి!
ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఎంతో మంది ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల స్ట్రెస్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
- చక్కెర స్థాయి తక్కువగా ఉండే తృణధాన్యాలు, ఓట్స్ తీసుకోవాలి
- ఒమేగా త్రీ ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు తినాలి
- మెగ్నీషియం, పొటాషియ ఉండే గుమ్మడికాయ విత్తనాలు సేవించాలి
- అరటిపళ్లు, అవకాడో పళ్లు తరచూగా తీసుకోవాలి
- సి-విటమిన్ ఉన్న కమల, ఉసిరి తినాలి
- బ్లాక్ టీ తాగాలి
- పిస్తా, బాదం వంటి పలు డ్రై ఫ్రూట్స్ ఆహారంలోకి చేర్చుకోవాలి
- డార్క్ చాక్లెట్లు తింటే స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి
- ఆహారంలో పసుపు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి
- క్యారెట్‌ను ఎక్కువగా తినాలి
- ప్రతిరోజు నిద్రపోయేముందు పసుపు కలిపిన గ్లాస్ పాలు తాగాలి
- ఆయిల్ ఫుడ్స్, జంక్‌ఫుడ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి
- ముఖ్యంగా ప్రతీరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
ఇవీ చదవండి: