Semen Leakage Through Urine: మూత్రంలో పాటు వీర్యం బయటపడుతుంటుంది. అయితే.. ఇలా జరిగితే నరాల బలహీనత సమస్య ఉందేమో! అని చాలా మంది భయపడుతూ ఉంటారు. దీనిపై నిపుణులు ఏమన్నారంటే..
నిపుణుల మాట..
వీర్యం అనేది నిరంతరం తయారవుతూనే ఉంటుంది. వీర్య కణాలు శరీరం నుంచి ఏదోవిధంగా బయటకు రావాల్సిందే. అవి అలాగే నిల్వ ఉండిపోవు. వీర్యం నిల్వ చేసే గ్రంధులను శుక్రకోశాలు(టూబ్యులార్ గ్లాండ్స్) అని అంటాం. ఈ గ్రంధులు నిండిపోయినప్పుడు వీర్యం తప్పకుండా బయటకు వచ్చేస్తుంది.
సాధారణంగా మూత్రంతో పాటు వీర్యం కూడా బయటపడిపోతుంది. నిద్రలో కూడా తెలియకుండానే వీర్యం పడిపోతుంది. ఇది ఉండటం వల్లే పెద్దగా ప్రయోజం ఏమీ ఉండదు. బయటకి పోవడం వల్ల నష్టం కూడా ఏమీ జరగదు. మూత్రంలో వీర్యం పోతే అది నరాల బలహీనత కాదు.