వృద్ధాప్యం అనేది జీవితంలో తప్పనిసరిగా ఎదుర్కోవలసిన దశ. ఆరోగ్య స్థితిని సరైన స్థాయిలో ఉంచటానికి ఆయుర్వేదం తగిన ఉపాయాలు సూచించింది. మలివయసులో శ్యాసకోశ సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. పొగ తాగే అలవాటు ఉన్న వాళ్లకు ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కొద్దిగా పని చేసినా ఆయాసం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం ఇత్యాది సమస్యలు కలుగుతుంటాయి. వీటికి తగిన నివారణలు తెలుసుకుందాం.
- 5-10 గ్రా. కరక్కాయ చూర్ణాన్ని ఒక చెంచా తేనెలో కలిపి దగ్గు తగ్గే వరకు తీసుకోవచ్చు.
- 2-3 గ్రా. త్రికటు చూర్ణం తేనె లేక వేడినీటితో తీసుకుంటే శ్వాస కోశాలలో పేరుకున్న శ్లేష్మం బయటకు వచ్చి శ్వాసకోశాలు శుభ్రపడతాయి.
- 10 గ్రా. వాసాకంటకారి లేహ్యన్ని కొన్ని రోజుల పాటు తీసుకుంటే పొగ తాగడం వల్ల వచ్చే దగ్గు శమిస్తుంది.
- సితోఫలాది చూర్ణం లేక తాళిసాది చూర్ణం అప్పుడప్పుడు తీసుకుంటే గొంతు, ఊపిరి మార్గం తాజాగా ఉంటాయి.
పెద్దవయసులో శరీరంలోని కండరాలు, ఎముకలు బలహీనపడి కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, బోలు ఎముకలు రోజువారి పనుల్లో ఇబ్బందులు కలిగిస్తాయి.
- నొప్పి ఉన్న కీళ్లపై కర్పూరాది తైలాన్ని రోజుకు రెండు సార్లు మర్దన చేయాలి.
- కీళ్లనొప్పి అధికంగా ఉంటే నిర్గుండి తైలాన్ని రోజుకు రెండు సార్లు మర్దన చేయాలి.
- త్రయోదశాంగ గుగ్గులు రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
- బోలు ఎముకల నిరోధానికి నల్లేరు గణుపులను పచ్చడిలా చేసుకుని తినవచ్చు.
ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు విసర్జక వ్యవస్థ కూడా దెబ్బతిని మూత్ర విసర్జనలో అవరోధం, అతి మూత్రం లేదా మూత్రం ఆగిపోవడం, మూత్రంలో మంట, పురుషులలో పురీష గ్రంధి వాపు, స్త్రీలలో అధిక నెల స్రావం లేదా అతి తక్కువ నెల స్రావం కలుగవచ్చు.
- 5 గ్రా. ధనియాలను 100 మి.లీ. నీటిలో 12 గం.ల పాటు నానబెట్టి, వడగట్టి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
- చంద్రప్రభావటి మాత్రలను రోజుకు రెండుసార్లు ఒక నెల రోజులు వాడాలి