శరీరంలో జీవక్రియలు జరగాలన్నా.. బయట పనులు చేసుకోవాలన్నా.. మనకు శక్తి చాలా అవసరం. ఈ శక్తిని క్యాలరీల్లో కొలుస్తారు. ఆహారం ద్వారా లభించిన క్యాలరీలు (Calories In A Day) శరీర జీవక్రియలకు ఉపయోగపడుతాయి. ఈ జీవక్రియలకు ఖర్చు కాగా.. మిగిలినవి కొవ్వుగా మారుతాయి. దీనినే ఫ్యాట్ అని పిలుస్తారు. ఒక్కొసారి కాలేయం, కండరాల్లో నిల్వ ఉన్న క్యాలరీలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి విడుదలైనప్పుడు రక్తంలోకి విడుదల అవుతాయి. దీని వల్ల తక్షణం శక్తి లభిస్తుంది. మనిషి శరీరతత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరమవుతాయి. సగటున ఒక మనిషికి రెండు వేల క్యాలరీల శక్తి అవసరం అవుతాయి. ఈ క్యాలరీలకు మించిన ఆహారం తీసుకుంటే.. వారిలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయం వస్తుంది. కాబట్టి తక్కువ క్యాలరీల ఉండే ఆహారాన్ని తీసుకొని వాటిని ఖర్చు చేసుకోవడం వలన బరువు అదుపులో ఉంటుంది.
పిండి పదార్థాలు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు, కొవ్వుల ద్వారా శక్తి లభిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల ద్వారా మనకు ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. వీటి ద్వారా దాదాపు 60 శాతం క్యాలరీలు లభించే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రోటీన్లు నుంచి 20 శాతం, మిగతా 20 కొవ్వులు, ఇతర ఆహార పదార్థాల నుంచి పొందుతాం.
క్యాలరీలు ఎక్కువ అయితే బరువు పెరిగే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మనం ఇంకా బరువు పెరిగుతాం. అయితే తగ్గాలి అనుకునే వారు వాటి మోతాదును తగ్గించాలి. దీని స్థానంలో ప్రోటీన్లు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి క్యాలరీలు తక్కువగా అందుతాయి. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తక్కువ క్యాలరీలను సులభంగా ఖర్చు చేసుకోవచ్చు.