తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Pregnant Woman Bath Per Day : గర్భిణీలు ఎక్కువసార్లు స్నానం చేస్తే ఇబ్బందా? మెట్లు ఎక్కకూడదా? - ప్రెజ్నెంట్ మహిళలు ఏం చేయాలి

Pregnant Woman Bath Per Day : గర్భిణీలు ప్రసవం అయ్యే వరకు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది గర్భిణీలు స్నానం ఎక్కువ సార్లు చేస్తే ఇబ్బందని.. మెట్లు దిగడం, ఎక్కడం కూడా ప్రమాదమని భావిస్తుంటారు. ఈ అనుమానాలు నిజమో? కాదో తెలుసుకుందామా మరి.

Pregnant Woman Bath Per Day
Pregnant Woman Bath Per Day

By

Published : Aug 21, 2023, 5:05 PM IST

Pregnant Woman Bath Per Day : గర్భిణీలు పిల్లలు పుట్టేవరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో మాత్రం.. చాలామందికి సందేహాలు ఉంటాయి. ఎక్కువసార్లు స్నానం చేయడం.. పదేపదే మెట్లు ఎక్కడం, దిగడం వల్ల అబార్షన్ అవుతుందని కొందరు చెబుతుంటారు. ఇలాంటి విషయాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఒక సారి చూద్దాం.

సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజుకొకసారి స్నానం చేస్తారు. కొందరికి ఉదయం, సాయంత్రం రెండుసార్లు స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ గర్భిణీల విషయానికొస్తే.. స్నానానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

గర్భిణీలు స్నానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గర్భిణీలు ఎక్కువసార్లు స్నానం చేయకూడదని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది మూఢనమ్మకమని కొందరు కొట్టి పారేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళు అలా చెప్పడం వెనుక మంచి ఉద్దేశంతో కూడిన కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. మరీ వేడిగా లేదా చల్లగా ఉన్న నీటితో స్నానం చేయకూడదు. ఎందుకంటే అది రక్త ప్రసరణలో మార్పులు తెస్తుంది. అలాగే ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల ఒక్కోసారి జలుబు చేసే అవకాశం కూడా ఉంది. ఎక్కువసేపు తడిగా ఉన్న ప్రదేశాల్లో గర్భిణీలు ఉండడం వల్ల జారిపడిపోయే అవకాశం ఉంది. అంతేకానీ గర్భిణీలు ఎక్కువసార్లు స్నానం చేయకూడదని ఏమీ లేదు. కాకపోతే.. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.

గర్భిణీలు మెట్లు ఎక్కితే ఏమవుతుంది..?
Can Pregnant Lady Climb Stairs : గర్భిణీలు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండకూడదని పెద్దలు చెబుతారు. మెట్లు ఎక్కి, దిగడం వల్ల అబార్షన్ అవుతుందని హెచ్చరిస్తారు. అయితే ఈ అనుమానాలపై వివరణ ఇచ్చారు వైద్య నిపుణులు. మెట్లు ఎక్కడం, దిగడం వల్ల అబార్షన్ కాదని తెలిపారు. ఆ సమయంలో జారి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ' గర్భిణీలు బరువులు పట్టుకుని మెట్లు ఎక్కకూడదు. గర్భిణీలు మెట్లు ఎక్కేటప్పుడు పక్కన రెయిలింగ్ పట్టుకోవడం తప్పనిసరి. ఒకే చేతితో మోయగలిగేంత బరువు ఉండి, మరో చేతితో రెయిలింగ్ పట్టుకునే అవకాశం ఉంటే మెట్లు ఎక్కడం ప్రమాదం కాదు. అలాగే మెట్లపై తడిలేకుండా చూసుకోవాలి. లేదంటే జారిపడే ప్రమాదం ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక్కో ఫ్లోర్​కు ఆగి.. విశ్రాంతి తీసుకుంటే మంచిది. కాకపోతే.. పొత్తికడుపులో నొప్పి, బ్లీడింగ్ సమస్యలు ఉన్నప్పుడు వీలైనంత వరకు మెట్లు ఎక్కడం, దిగడం ఆపేయడం మంచిది' అని నిపుణులు సూచిస్తున్నారు.

గర్భిణీలు ఎక్కువసార్లు స్నానం చేస్తే ఇబ్బందా?

గర్భిణీగా ఉన్నప్పుడు ప్రయాణాలా..? ఇవి గుర్తుపెట్టుకోండి!

Hair Growth Tips : జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలా? ఈ పనులు అస్సలు చేయకండి

ABOUT THE AUTHOR

...view details