దేశంలో కరోనా విలయం తీవ్రంగా మారింది. వైరస్ బారిన పడ్డ వారికి కనీస వసతులు కరవవుతున్నాయి. సరైన చికిత్స అందక చాలా మంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల... కరోనా సోకిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న వారు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అవయవాలు ఏవైనా దెబ్బతిన్నాయా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను తెలుసుకునేందుకు పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని అంటున్నారు.
అవేంటంటే?
విటమిన్ డీ:
కరోనా వైరస్ వల్ల విటమిన్ డీ లోపం ఏర్పడుతుందని తేలింది. అందువల్లే కరోనా చికిత్సలో భాగంగా విటమిన్ డీ సప్లిమెంట్లను ఇస్తున్నారు. మీకు నెగెటివ్‌గా తేలిన వెంటనే శరీలంలో విటమిన్ స్థాయిలను గుర్తించే పరీక్షలను చేయించుకోవడం ఉత్తమం. డీ విటమిన్‌కు సంబంధించి ఇంకేమైనా చికిత్స అవసరమో లేదో ఈ టెస్టుల ద్వారా తెలుస్తుంది.
ఇదీ చదవండి-Vaccination: టీకా తీసుకున్నవారి నుంచి వైరస్ రాదా?
ఛాతి స్కానింగ్:
కొవిడ్ లక్షణాల్లో దగ్గు, జలుబు ముఖ్యమైనవి. కరోనా సోకిన సమయంలో రోగుల ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని సార్లు బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులూ ఊపిరితిత్తులపై దాడి చేస్తున్నాయి. ఇలాంటివి ముందే గుర్తించాలంటే హెచ్ఆర్సీటీ స్కానింగ్ చేయించుకోవాలి.