Pimples on Face Removal Tips :చాలామందికి యుక్త వయసులో మొహంపై మొటిమలు ఏర్పడతాయి. వయసుతో సంబంధం లేకుండా కొందరిని ఈ సమస్య బాధిస్తుంది. ఇవి తగ్గిన తర్వాత కూడా ఒక్కోసారి మచ్చలుగా ఉండిపోతాయి. చర్మ రంధ్రాలు వాపునకు గురి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మొటిమల సమస్య కోట్లాది మందిని వేధిస్తోంది. దీనిపై చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే సమస్యను మరింత తీవ్రతరం చేసుకుంటారు. మొటిమల సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమల్ని గిల్లకూడదు..
Precautions for Pimples on Face :చాలామంది మొటిమల సమస్య ఉన్నప్పుడు వాటిని గిల్లుతారు. అలా చేయడం వల్ల వాపు పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మచ్చలు కూడా ఏర్పడతాయి. నల్లటి మచ్చల వల్ల మొహం అందాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
టూత్ పేస్ట్ రాసుకోవడం సరైందేనా?
Pimples on Face Toothpaste :మొటిమలపై టూత్ పేస్ట్ రాసుకోవడం వల్ల నయం అవుతాయని చాలామంది భావిస్తుంటారు. టూత్ పేస్ట్ అనేది మొటిమల పరిష్కారం కోసం తయారు చేసింది కాదు. టూత్పేస్ట్లోని బేకింగ్ సోడా వంటి పదార్థాలు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. మొటిమలపై టూత్ పేస్ట్ రాసుకోవడం వల్ల ఇరిటేషన్ కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతిని పాటించకపోవడమే మంచిది.
మొటిమలు ఎవరిలో తీవ్ర ప్రభావం చూపుతాయి?
Pimples on Face Reason :మొటిమల సమస్య ఎవరికైనా రావచ్చు. కానీ కొంతమంది మొహం ఆయిలీగా ఉంటుంది. అలాంటి వారిని మొటిమల సమస్య ఎక్కువగా భాధిస్తుంది. ఆయిలీ ఫేస్ ఉన్నవారిలో మొటిమల సమస్య ఏర్పడడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.