తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీరు ఎంత కాలం జీవిస్తారో చెప్పే 'సింగిల్ లెగ్ బ్యాలెన్స్​ టెస్ట్​'! - know your health status

ఒంటి కాలిపై నిలబడగలరా? ఎంత సేపు? కనీసం 10 సెకన్లు? లేదంటే ఇబ్బందే అంటున్నారు పరిశోధకులు. అసలు ఒంటి కాలిపై నిలబడడానికి, మన ఆరోగ్య పరిస్థితికి సంబంధమేంటో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

one leg balance test
మీరు ఎంత కాలం జీవిస్తారో చెప్పే 'వన్ లెగ్ బ్యాలెన్స్​ టెస్ట్​'!

By

Published : Aug 12, 2022, 10:28 AM IST

Updated : Sep 20, 2022, 2:42 PM IST

మీరు ఎంత కాలం జీవిస్తారో చెప్పే 'వన్ లెగ్ బ్యాలెన్స్​ టెస్ట్​'!

One leg balance test norms : కనీసం 10 సెకన్ల పాటు ఒంటి కాలు మీద నిలబడలేని 50 ఏళ్లు పైబడిన వారు అనారోగ్యం పాలయినట్లేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2009 నుంచి 1,702 మందిపై బ్రెజిల్​లోని ఓ సంస్థ చేసిన అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్​లో ప్రచురితమైంది. ఈ పరీక్షలో భాగంగా ఒక కాలు భూమి మీద ఉంచి రెండో కాలును ఒక అడుగు పైకి లేపాలి. భూమి మీద ఉన్న కాలు వెనుకగా రెండో కాలును పెట్టాలి. ఈ టెస్ట్​లో ఒక్కొక్కరికి మూడు సార్లు అవకాశం ఇస్తారు. అందులో ఒక సారైనా పాసవ్వాలి. ఇలా చేసిన ఈ టెస్ట్​లో ప్రతి అయిదుగురిలో ఒకరు విఫలమయ్యారు.
10 సెకన్ల పాటు ఒక కాలు మీద నిలబడలేని మధ్య వయస్కులు ఒక దశాబ్దంలో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ టెస్ట్​లో ఫెయిలైన వారు వచ్చే పదేళ్లలో మరణించే అవకాశం 84 శాతం ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడైంది.

బ్రెజిల్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో వృద్ధుల కోసం చేసే సాధారణ ఫిట్​నెస్​ టెస్ట్​లకు బ్యాలెన్సింగ్ పరీక్షను జోడించడం వల్ల వైద్యులకు కావలసిన ఆరోగ్య సమాచారం అందుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సరిగా నిల్చునే సామర్థ్యం లేక కింద పడిపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6,80,000 కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు. ఈ 10 సెకన్ల పరీక్ష ద్వారా అలాంటి ఇబ్బందులు ఉన్న వారెవరో తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

Single leg balance test : 'ఈ పరీక్ష చాలా సురక్షితమైనది. కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. ఇది రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు తెలియజేస్తుంది." అని పరిశోధకులు చెప్పారు. ఫిటినెస్ టెస్ట్​లో సఫలమైన వారితో పోల్చితో విఫలమైన వారి మరణ శాతం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఫిటినెస్ టెస్ట్​లో ఫెయిలైనవారు 17.5 శాతం మంది మరణించగా, పాసైనవారు కేవలం 4.5 శాతం మంది మరణించారని వివరించారు.

Last Updated : Sep 20, 2022, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details