How to get Rid of Artificial Jewellery Allergy :ఆడవారికి నగలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు ఆర్థిక స్తోమతను బట్టి బంగారు నగలు ధరిస్తే.. మరికొందరు ఆర్టిఫిషియల్ ఆభరణాలు వేసుకుంటుంటారు. ప్రస్తుతం గోల్డ్‌కు భారీగా డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది మహిళామణులు ఆర్టిఫిషియల్ ఆభరణాల(Artificial Jewellery)వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే.. ఈ నగల తయారీలో వాడే కొన్ని లోహాల కారణంగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట.. వంటి సమస్యలు వస్తాయి. మేము చెప్పే ఈ టిప్స్ పాటించడం ద్వారా.. ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మరి, అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం.
- ఆర్టిఫిషియల్ ఆభరణాల తయారీలో ప్రధానంగా నికెల్ అనే లోహాన్ని వాడుతుంటారు. చాలామందిలో అలర్జీ రావడానికి ఇదే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు.
- ఆర్టిఫిషియల్ నగలు ధరిస్తే అలర్జీ వస్తోందని ఆందోళన చెందేవారు.. వాటిని వేసుకునే ముందే పౌడర్ లేదా మాయిశ్చరైజర్ లేదా క్యాలమైన్ లోషన్స్ రాసుకుంటే మంచిది.
- ఇవి నగలలో ఉండే మెటల్ ప్రభావం మీ చర్మంపై పడకుండా అడ్డుకుంటాయి.
- ఈ నగలు కొనుగోలు చేసిన తర్వాత వెంటనే వేసుకోకుండా.. ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌ను వాటిపై ఓ కోటింగ్ వేయండి.
- ఈ నెయిల్ పాలిష్ వేసిన తర్వాత ఆరబెట్టి.. ఆ తర్వాత వేసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా నగలలోని లోహాల ప్రభావం చర్మంపై పడదు.
- కొందరు మహిళలు మెడ దగ్గరగా ఉండే చోకర్, నెక్‌పీస్.. వంటి బిగుతుగా ఉండే ఆర్టిఫిషియల్ నగలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీళ్లకి అలర్జీ వచ్చే ఛాన్స్ ఎక్కువ.
- చోకర్, నెక్‌పీస్ వల్ల.. మెడ ప్రాంతంలో గాలి సరిగా ఆడదు. దీనివల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు వదులుగా ఉండే లాంగ్ చెయిన్స్, నెక్‌పీస్‌లు వంటివి ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!
- ఆర్టిఫిషియల్ నగల విషయంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. వీటిని భద్రపరిచే విషయంలో శ్రద్ధ తీసుకోరు. అవి తడిసినా, చెమట పట్టినా.. వాటిని అలాగే తీసి బాక్సుల్లో పెట్టి భద్రపరుస్తుంటారు.
- ఇలా చేయడం వల్ల వాటికి ఉన్న తడిదనంతో చాలా త్వరగా దెబ్బతింటాయి. అంతేకాదు.. స్కిన్ అలర్జీలకు ఇది మరింత కారణం అవుతుంది.
- కాబట్టి నగల్ని స్టోర్ చేసే ముందు పూర్తిగా ఆరనివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా వీటిని తేమ అధికంగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంచాలి.
- ఆర్టిఫిషియల్ జ్యుయలరీతో అలర్జీ సమస్య వస్తుందనుకునే వారు.. ఆ నగలకు లోపలి వైపు ప్లాటినం కోటింగ్ వేయించుకుంటే మరింత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- ఆర్టిఫిషియల్ నగలు ధరించడం వల్ల ఇప్పటికీ.. చర్మంపై దురదతో ఇబ్బంది పడుతున్నవారు.. కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.