తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కాఫీతో లాభాలే కాదు.. నష్టాలూ ఉన్నాయండోయ్​! - How to work caffeine in our body

చిక్కటి కాఫీ గొంతులో పడగానే ఎనలేని ఉత్సాహం వచ్చేస్తుంటుంది. అంతగా కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది ఈ పానీయం. అయితే.. కాఫీతో ప్రయోజనాలతో పాటు ప్రమాదమూ పొంచి ఉంటుంది.

MERITS AND DEMERITS OF DRINKING COFFEE
కాఫీతో లాభాలే కాదు.. నష్టాలూ ఉన్నాయండోయ్​!

By

Published : Oct 21, 2020, 5:45 PM IST

వేడి వేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్‌ మహత్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది.

ఇబ్బందులూ ఉన్నాయ్​..

ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాఫీతో ఇబ్బందులూ లేకపోలేదు. కాఫీ తాగితే మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటిశాతం తగ్గే(డీహైడ్రేషన్‌) ప్రమాదముంది. అలాగే ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారూ మితం పాటించటం మంచిది. కెఫీన్‌ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేన్పుల వంటి సమస్యలకు దారితీయొచ్చు.

కెఫీన్‌ రక్తపోటు పెరిగేలా చేస్తుంది కాబట్టి హైబీపీ బాధితులు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు. అంతేకాదు.. మనం తిన్న ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్‌ అడ్డుతగులుతుందని గుర్తించాలి. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్‌ స్థాయులు తారస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4-6 గంటల వరకు కనబడుతుంది. అందువల్ల నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవటం ఉత్తమం.

ఇదీ చదవండి:మీరు కాఫీ తాగుతున్నారా...? అయితే ఇవి తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details