తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

డి-విటమిన్​ కోసం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసా? - విటమిన్​ డి లేకపోతే ఏమవుతుంది

పెద్దగా శ్రమ పడకుండానే అలసటకు లోనవుతారు కొందరు. మూడు పదుల వయసు నిండకుండానే కీళ్ల నొప్పులు అంటారు ఇంకొందరు. జలుబు, జ్వరం ఆరోగ్య సమస్యలతో తరచూ బాధపడుతుంటారు మరికొందరు. వీటన్నింటికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? డి-విటమిన్​ లోపమే వీటన్నింటికి కారణమని మీకు తెలుసా? అసలు డి-విటమిన్​ మన శరీరానికి ఎందుకంత అవసరం? ఒకవేళ శరీరంలో డి-విటమిన్​ లోపిస్తే ఏం జరుగుతుంది? అన్న సందేహాలు తీరాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

విటమిన్​ డి ఉపయోగాలు
Vitamin D Benefits

By

Published : Dec 21, 2022, 5:00 PM IST

డి-విటమిన్​ కోసం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసా?

ముఖ్యంగా శీతాకాలంతో పాటు వర్షాకాలంలోనూ డి-విటమిన్​ లేమి సమస్యను చాలా మంది ఎదుర్కొంటారు. సాధారణంగా విటమిన్​-డి సూర్య రశ్మి ద్వారా లభ్యమవుతుందని అందరికీ తెలుసు. బయట ఎండలో నడిచినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి సహజ సిద్ధంగా విటమిన్​-డిను తయారు చేసుకుంటుంది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా శరీరానికి తగిన మోతాదులో డి-విటమిన్​ అందట్లేదని వైద్యులు చెబుతున్నారు. డి-విటమిన్​ తక్కువ అయితే ఏ సమస్యలు వస్తాయి? ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే విటమిన్​ డి పుష్కలంగా లభిస్తుంది? వంటి విషయాల సమాహారమే ఈ కథనం.

డి-విటమిన్ లోపం వల్ల తలెత్తే సమస్యలు:

  • కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, అలసట, డిప్రెషన్​కు గురవ్వటం
  • సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, కండరాలు బలహీనంగా మారటం
  • శరీరంలో విటమిన్​-డి ఉండాల్సిన దాని కంటే తక్కువ మోతాదులో ఉంటే మెటబాలిజమ్ దెబ్బతిని శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది.
  • శరీరంలో విటమిన్​-డి తక్కువగా ఉంటే ఎముకల బలం క్షీణించడమే కాకుండా గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది.0

డి-విటమిన్ సంపూర్ణంగా లభించే ఆహార పదార్థాలు:

  • సాల్మన్​, సార్డైన్స్​, మ్యాకరల్​, ట్యూనా రకాల చేపల్లో డి-విటమిన్​ అధికంగా ఉంటుంది.
  • పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి డెయిరీ ఉత్పత్తులు
  • చికెన్​ లివర్​, రొయ్యలు​, రాగులు, మొక్కజొన్న, సోయా, రాజ్మా, బొబ్బర్లు, పుట్టగొడుగులు
  • నువ్వులు, వేరుశనగ, కొత్తిమీర, తోటకూర, మునగాకు
  • నారింజ, దానిమ్మ, ఎండు ద్రాక్ష, బొప్పాయి పండ్లు
  • ఓట్స్​, డార్క్ చాక్లెట్, కాడ్​ లివర్ ఆయిల్, లవంగాలు, యాలకులు

సహజంగా విటమిన్​-డి సూర్య రశ్మి ద్వారా అందుతుంది. రోజూ ఎండలో వాకింగ్, వ్యాయామం లాంటివి చేస్తే శరీరానికి విటమిన్​-డి సమృద్ధిగా లభిస్తుంది. డి-విటమిన్​కి సంబంధించి ఏవైనా మాత్రలు తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మేలు.

ABOUT THE AUTHOR

...view details