తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మొటిమలు తగ్గాలని పసుపు, నిమ్మ వాడుతున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Pimples Treatment: అందమైన ముఖంపై దిష్టిచుక్కల్లా మొటిమలు కనిపిస్తుంటే ఎవరికైనా చికాకు కలగకమానదు. అద్దంలో చూసుకున్నప్పుడు ఒక్క మొటిమ కనిపిస్తే చాలు.. విలవిల్లాడిపోతారు. అయితే.. చాలామంది మొటిమలు తగ్గాలని పసుపు, నిమ్మరసం రాసుకోవడం వంటివి చేస్తుంటారు. దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? మొటిమలు, నల్లమచ్చలు తగ్గడానికి దారేది?

Is Turmeric and Lemon Good For Pimples ?
Is Turmeric and Lemon Good For Pimples ?

By

Published : Jun 30, 2022, 7:02 AM IST

Pimples Treatment: సౌందర్యపరంగా అమ్మాయిలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి. ముఖంపై మొటిమలు రావడానికి వయసు, హార్మోన్ల ప్రభావం సహా ఇతరత్రా కారణాలు ఉండొచ్చు. వీటిని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయినా సరైన ప్రయోజనం ఉండదు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం డాక్టర్లు ఏం చెప్పారో చూడండి.

మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి..?

వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో వచ్చే మార్పుల్లో మొటిమలు కూడా ఒకటని చెబుతున్నారు వైద్యులు. అలా అని.. నిర్లక్ష్యం చేయకుండా మొటిమలు తగ్గేందుకు ట్రీట్​మెంట్​ తీసుకోవచ్చని అంటున్నారు. డెర్మటాలజిస్ట్​ సలహాతో సరైన చికిత్సతో.. మంచి స్కిన్​ను సొంతం చేసుకోవచ్చని వివరించారు. ముందు.. పసుపు, నిమ్మరసం రాసుకోవడం వంటి ఇంటి చిట్కాలు మానేయాలని హితభోద చేస్తున్నారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్​ యాసిడ్​తో మరింత ఇబ్బందిగా మారి.. చర్మం నిర్జీవంగా మారడం, నల్లగా అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనితో సమస్య మరింత తీవ్రమవుతుందని అంటున్నారు.

''ట్రీట్​మెంట్​లో చాలా దశలు ఉంటాయి. ఫస్ట్​ స్టేజ్​లో క్రీమ్స్​ వాడటం.. సెకండ్​ స్టేజ్​లో ట్యాబ్లెట్స్​ వినియోగం.. ఆ తర్వాత కూడా తగ్గకుంటే కెమికల్​ పీల్స్​ ట్రీట్​మెంట్​తో సమస్య పరిష్కారం అవుతుంది. పింపుల్స్​ రావడం తగ్గిన తర్వాత.. లేజర్​ చికిత్స, లేజర్​ టోనింగ్​ టెక్నిక్​తో నల్ల మచ్చలు కూడా తొలగించుకోవచ్చు. వెంటనే తగ్గలేదని నిరుత్సాహపడొద్దు. యాంటీ బయాటిక్స్​, హార్మోనల్​ ట్యాబ్లెట్స్​ వంటివాటిని డాక్టర్ల సలహా మేరకు తీసుకొని కూడా మొటిమల్ని తగ్గించుకోవచ్చు. మెడికేషన్​ వాడాక మధ్యలో ఆపేస్తే సమస్య తీవ్రం అవుతుందని చాలా మంది భయపడుతుంటారు. కానీ.. సరైన జాగ్రత్తలు.. మంచి డైట్​తో దీనిని కంట్రోల్​ చేయొచ్చు. అయితే.. ఎక్కువగా ట్యాబ్లెట్లు వాడకుండా.. క్రీమ్స్​తో కంట్రోల్​ చేసుకోవడం శ్రేయస్కరం.''

ABOUT THE AUTHOR

...view details