తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Vomiting During Journey : జర్నీ చేసేటప్పుడు వాంతులా.. ఈ చిట్కాలు ట్రై చేయండి - ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా

Vomiting During Journey : బస్సుల్లో, కార్లలో, రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు కొందరికి వాంతులు అవుతుంటాయి. కొందరైతే ఏకంగా కిటికీ నుంచి తలను బయటకు పెట్టి వాంతులు చేసుకుంటారు. ఇది ప్రమాదమే అని తెలిసిన సరే తప్పక చేస్తారు. ఇటువంటి సీన్లు కారు, బస్సు ప్రయాణాల్లో ఎక్కువగా చూస్తాము. దీంతో వారు ప్రయాణం చేయాలంటేనే భయపడతారు. ఇంతకీ ప్రయాణాలు చేసేటప్పుడు ఎందుకు వాంతులు అవుతాయి? దీనికి గల కారణాలు ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం?

Vomiting
Vomiting

By

Published : May 23, 2023, 2:40 PM IST

Vomiting During Journey : ప్రయాణం అంటేనే కొందరిలో తెలియని భయం ఉంటుంది. ఎందుకంటే వారు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ వికారం, తల తిప్పడం జరిగి వాంతులు అవుతాయోనని భయం. దీంతో వారు పెద్దగా ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టపడరు. ఇలా వాంతులు కావడాన్ని వైద్య భాషలో మోషన్ సిక్​నెస్​, కైనెటోసిస్ అంటారు. ఆటో, కారు, రైలు, బస్సు, విమానం, నౌక ఇలా దేనిలో ప్రయాణించిన

ఈ ఇబ్బంది తప్పదు. ఇందుకు గల కారణం ఒకటే.. కళ్ల నుంచి, లోపలి చెవి నుంచి మెదడుకు అందే సమాచారం మధ్య తేడా ఉండటమే. కాళ్లు, చేతులు నుంచి వచ్చే సంకేతాలతో మన శరీరం కదులుతుందా? లేదా? అనేది మెదడు తెలుసుకుంటుంది. మరోవైపు లోపలి చెవిలోని ఎండోలింపు అనే ద్రవం శరీరం కదులుతున్న విషయాన్ని గ్రహించి, మెదడుకు చేరవేస్తుంటుంది. మనం ప్రయాణిస్తున్నా కదలటం లేదని కళ్ల నుంచి సమాచారం మెదడుకు అందితే.. తికమకపడుతుంది. దీంతో వాంతులు, వికారం వంటి లక్షణాలు శరీరంలో తలెత్తుతాయి.

ఎలాంటి చిట్కాలు తీసుకోవాలి : శరీరంలో ఆందోళన, ఒత్తిడి, నిస్సత్తువతో ఇవి మరింత తీవ్రమవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. కొందరిలో అయితే ప్రయాణం మొదలు కాగానే వాంతులు సమస్య మొదలవుతుంది. మరికొందరిలో మాత్రం ఆ వాహనం కండీషన్ బట్టి ఉంటుంది. వాహనంలో ప్రయాణించే వ్యక్తులు అందులో వాసన వచ్చినసరే.. వికారంగా ఉంటుంది. అలాగే ఘాట్​రోడ్లు, ఎక్కువసేపు ప్రయాణం, ఎగుడుదిగుడు రోడ్లు వల్ల వాంతులు అనేవి సంభవిస్తాయని డాక్టర్లు చెపుతున్నారు. మరి ప్రయాణాల్లో వాంతి, వికారం, తలనొప్పి తగ్గించుకోవడం ఎలా? ఇందుకు ఏఏ చిట్కాలు ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.

  • కారులో లేదా బస్సులో ముందు సీటులో కూర్చోవటం మంచి పద్ధతి. వారు తాము కూర్చు దిశకు ముందుకు వైపునకు చూసేలా కూర్చోవాలి. ఒకే దూరంలో దృష్టిని కేంద్రీకరిస్తే మంచిది. ఇలా చేయటం వల్ల చెవులు, కళ్ల నుంచి మెదడుకు ఇచ్చే సమాచారంలో తేడా తగ్గడానికి సహాయం పడుతోంది.
  • వీలైతే కళ్లు మూసుకోవాలి లేదా నిద్రపోవాలి.
  • దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి.
  • విమానాల్లో, రైళ్లల్లో, బస్సుల్లో, ఆటోల్లో కిటకీ పక్క సీటులో కూర్చుంటే మంచిది.
  • మద్యం, కాఫీ వంటి పానీయాలు తీసుకోవద్దు.
  • సిగరెట్లు వంటివి కాల్చకుండా ఉంటే కాంతి కాదు.
  • శ్రావ్యమైన, వినడానికి ఎంతో బాగుండే వినసొంపుగా ఉండే సంగీతం వినాలి. అది కూడా తమకు ఇష్టమైన సంగీతమే.
  • డాక్టర్ల సలహా మేరకు ప్రయాణానికి గంట ముందే.. వాంతి తగ్గించే మాత్రలు వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
  • సొంత వాహనమైతే తరచూ ఎక్కడిపడితే అక్కడ కాసేపు ఆగవచ్చు. దీనివల్ల వాంతి అనేది అవ్వడం తగ్గుతుంది.
  • రుచికరమైన బిళ్లలు చప్పరించవచ్చు. అల్లం రుచితో ఉన్న విక్స్ వంటి రుచికరమైన బిళ్లలైతే వికారాన్ని కాస్త తగ్గిస్తాయి.
  • ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మకాయను చేతితో పట్టుకుంటే.. ప్రయాణించే సమయంలో ఆ నిమ్మకాయ వాసనను పీల్చితే వాంతి, వికారం అనేది కాదు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details