How to Make Natural Cleaners for House Cleaning:ఇంటిని శుభ్రం చేయాలంటే.. గతంలో ఫ్లోర్‌ను నీళ్లతో కడిగేవారు. కానీ.. ఇప్పుడు లెక్కలేనన్ని క్లీనర్లు, లిక్విడ్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. అయితే.. వాటిలోని రసాయనాలు మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. పసిపిల్లలుంటే మరీ ఇబ్బంది పడాలి. కాబట్టి.. కెమికల్ క్లీనర్స్‌తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి, ఇప్పుడు ఏం చేయాలి అంటారా? ఇంట్లోనే సహజంగా క్లీనర్స్ తయారు చేసుకోండి అంటాం! "మాకు తెలియదు" అంటారా..? ఈ ఆర్టికల్ చదివితే సరిపోతుంది అంటాం..!
కిచెన్: వంటగదిలో పొయ్యి, టైల్స్, కిటికీ అద్దాలు కొన్ని రోజులకే మురికిగా, జిడ్డు పట్టినట్టుగా తయారవుతాయి. వీటిని శుభ్రం చేయడానికి.. పావు కప్పు వెనిగర్, చెంచా బేకింగ్‌సోడా, రెండు కప్పుల నీరు కలిపి లిక్విడ్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి జిడ్డు ఉన్నచోట చల్లి అరగంట తర్వాత శుభ్రం చేస్తే సరి. ఈ మిశ్రమంలోనే కొద్దిగా నిమ్మనూనె కూడా కలిపితే శుభ్రతతోపాటు, ఇల్లు మంచి స్మెల్ కూడా వస్తుంది.
గ్యాస్ స్టౌ నుంచి మంట సరిగా రావట్లేదా? - ఇలా ఈజీగా సెట్ చేయండి!
ఓవెన్:ఆహార పదార్థాలను మైక్రో ఓవెన్‌లో వేడి చేసే క్రమంలో.. లోపల ఆయిల్ ఫుడ్స్ పడి ఓవెన్ జిడ్డుగా మారుతుంది. ఆ మరకలు పోవాలంటే.. కప్పు వెనిగర్‌కి, కొద్దిగా నిమ్మరసం కలిపి స్ప్రే చేసి మూడు నిమిషాలు వదిలేయండి. తర్వాత శుభ్రం చేస్తే మురికి, వాసన తొలగిపోతాయి. రెండు వారాలకోసారి ఇలా చేస్తే ఓవెన్ శుభ్రంగా ఉంటుంది.