తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

10 రోజుల్లో బరువు తగ్గాలా? ఈ చిట్కాలు పాటించండి! - weight loss diet

అధిక బరువు ఈరోజుల్లో చాలా మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. లావుగా ఉంటే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక బరువును 10 రోజుల్లోనే తగ్గించుకునేందుకు కొన్ని పద్ధతులు(How to lose weight fast) ఉన్నాయి. ఈ సింపుల్​ టిప్స్(Weight loss tips) పాటిస్తే బరువు తగ్గడం మరింత తేలికవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

Weight Lose
బరువు తగ్గడం ఎలా

By

Published : Nov 19, 2021, 7:04 AM IST

అధిక బరువు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది ప్రస్తుతం జిమ్​లు, ఫిట్​నెస్​ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. కృత్రిమంగా కాకుండా, సహజంగా(How to lose weight naturally) బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరి 10 రోజుల్లోనే బరువు తగ్గడానికి(Weight loss tips) ఏం చేయాలంటే..?

  • ఉదయం లేచిన వెంటనే.. క్రమం తప్పకుండా వ్యాయామాలు(Weight reduce exercise) చేయాలి. వ్యాయామంలో చురుకుదనం, వేగం ఉండాలి. ప్రతిరోజు 40 నిమిషాల నుంచి గంటపాటు ఇవి చేయాలి. తెల్లవారిన తర్వాత చేసే వ్యాయామంతో ఎక్కువ ఫలితం ఉంటుంది.
  • ఉదయం పూట అల్పాహారం(Breakfast for weight loss) మానేయొద్దు. అల్పాహారం మానేస్తే.. బరువు పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
  • ఆహారం ఎక్కువగా ఒకేసారి తీసుకోవడం కన్నా.. మితంగా రోజుకు ఐదారు సార్లు తీసుకోవడం ఉత్తమం.
  • నిత్యం బరువు చెక్ చేసుకోవద్దు.
  • జంక్ ఫుడ్ తినొద్దు. ఆకలిగా ఉన్నప్పుడు ఓ యాపిల్ తింటే మించిది.
  • ఆకలి మీద దృష్టి వెళ్లకుండా ఉండేందుకు పాటలు పాడడం, సంగీతం వినడం వంటివి చేయాలి.
  • రోజుకు 8 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.
  • కేలరీలు చెక్​ చేసుకుని తినాలి.
  • సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.
  • ఆల్కహాల్​ మానేయాలి. కాఫీలు, టీలు వంటివి ఎక్కువగా తాగకూడదు.
  • ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం(weight loss foods) తీసుకోవాలి. చెక్కర, ఆయిల్, ఫ్యాట్స్ తక్కువగా(Weight loss diet) ఉండేలా చేసుకోవాలి.
  • తినేప్పుడు గబగబా కాకుండా మెల్లగా తినే అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కడుపు నిండిని భావన కలిగి, తినడం మానేస్తాం.
  • సాల్మన్ చేపలు, బ్రౌన్ రైస్​ ఆహారంలో భాగం చేసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details