తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చర్మంపై మాస్క్, శానిటైజర్​ల దాడి..!

మాస్క్​లు, శానిటైజర్​లు, చేతి తొడుగుల అధికంగా వాడకం వల్ల చర్మ అలర్జీ ఏర్పడటం సాధారణమవుతోంది. చర్మ వైద్య నిపుణురాలు డా. ఉమా ఎస్. కామత్ ఈ చర్మ సమస్యలను ఎలా అధిగమించాలో ఈటీవీ భారత్ సుఖీభవతో వెల్లడించారు.

Masks and Sanitizers
చర్మంపై మాస్క్, శానిటైజర్ ల దాడి..!

By

Published : Jun 5, 2021, 6:13 PM IST

ఈ మధ్య కాలంలో మాస్క్​లు వాడటం సర్వసాధారణంగా మారింది. దీనితో పాటే చర్మ సంబంధ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మాస్క్​లు, చేతి తొడుగులు తయారీలో వాడే పాలీయురెథెన్​లు అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్​ను కలుగచేస్తున్నాయి. శానిటైజర్ల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖానికి తగిలించుకునే మాస్క్ బిగుతుగా ఉండి చర్మంపై ఎక్కువ రాపిడిని కలుగచేస్తూ చర్మం కందిపోతుంది. తద్వారా దురద, మంట, పొక్కులు లేవటం మొదలైన లక్షణాలు కలుగుతాయి. చేతితొడుగుల వల్ల అరచేతులపై పగుళ్లు ఏర్పడతాయి. వాటిలో వాడే పొడి వల్ల ఇలా జరుగుతోంది. తరచూ శానిటైజర్స్​తో చేతులు శుభ్రం చేసుకున్నా అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువ సేపు నీరు, తడి వాతావరణం ఆవరించి ఉంటే చర్మం సున్నితత్వం వల్ల ద్రవం ఎక్కువగా చొరబడి సహజత్వాన్ని కోల్పోతుంది. తరచూ సబ్బు నీటితో కడుక్కోవటం వల్ల చర్మంపై గల సహజంగా ఉండే నూనెలు కోల్పోయి, పొడిబారి చర్మ వ్యాధులు కలుగుతాయి. శానిటైజర్​తో చర్మానికి మరింత నష్టం జరుగుతుండటం వల్ల సబ్బు, నీరు దొరకని పక్షంలోనే శానిటైజర్ వాడాలని, అందులో 60% ఆల్కహాల్ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

ఎవరికి ప్రమాదం:

  • క్షురకులు (హెయిర్ డ్రస్సెస్), సౌందర్య నిపుణులు (బ్యుటీషియన్స్).
  • నిర్మాణ రంగ కార్మికులు
  • లోహ కార్మికులు
  • ఆరోగ్య కార్యకర్తలు
  • వాహన మరమ్మతుదారులు (ఆటో మెకానిక్స్)
  • క్లీనర్స్
  • తోట పనివారు
  • వ్యవసాయ కార్మికులు

ఎలాంటి సమయంలో వైద్యుని సలహా తీసుకోవాలి?

  • చర్మంపై దురద, మంట కలిగినపుడు
  • శరీర ఇతర భాగాలకు దద్దుర్లు వ్యాపించినపుడు
  • కొన్ని వారాల తరువాత కూడా దద్దుర్లు తగ్గకపోయినపుడు
  • చర్మం నుంచి చీము కారుతున్నపుడు
  • ఈ లక్షణాలతో కూడిన జ్వరం వచ్చినపుడు

చికిత్స:

  • దేనివల్ల అలర్జీ వచ్చిందో గమనించి దానికి దూరంగా ఉంటే, కొన్ని రోజులకు చర్మం యథాస్థితికి వస్తుంది.
  • చర్మాన్ని సబ్బునీటితోనే కడగాలి.
  • చర్మంపై మంట, దురద తగ్గించటానికి చల్లటి గుడ్డను చర్మంపై ఉంచాలి. ఆ గుడ్డను బర్రోస్ ద్రావణంలో (అల్యూమినియం ఎసిటేట్) లో ముంచి చర్మంపై ఉంచితే మరింత రక్షణ చేకూరుతుంది.
  • డెట్టాల్, సేవ్ లాన్ లాంటివి వాడరాదు.
  • చర్మానికి తేమను చేకూర్చే వాసన లేని మలాములు(చర్మ లేపనం) వాడాలి.
  • కొన్ని సందర్భాల్లో ఔషధాలు వాడాలి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నపుడు యాంటిబయోటిక్స్ వాడాలి. స్టెరాయిడ్ కలసిన క్రీమును రోజుకు 1, 2 సార్లు 2-4 వారాలు వాడాలి. కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్ మాత్రలను, అలర్జీను నివారించే యాంటి హిస్టమిన్స్​ను వైద్యులు ఇవ్వవచ్చు.

ముఖంపైమాస్క్​ల వల్ల గాయాలు ఏర్పడకుండా ఏం చేయాలి:

  • ముఖం కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకుని మాస్క్ ధరించాలి.
  • వీలైనపుడల్లా మాస్క్ తీసివేయండి.
  • గుడ్డతో చేసిన మాస్క్​లను తరచూ ఉతకాలి.
  • మాస్క్ ధరించే ముందు పూర్తిగా పొడిగా ఉండాలి.

శానిటైజర్, చేతి తొడుగుల గురించి:

  • చేయి కడుక్కున్న వెంటనే తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
  • మందంగా ఉన్న శానిటైజర్​లు పలచగా ఉన్న వాటికంటే ఎక్కువ రక్షణనిస్తాయి.
  • సున్నితమైన చర్మం కలవారు చర్మవైద్యులను కలవాలి.

డర్మటైటిస్ రెండు రకాలుగా ఉండవచ్చు. వికటత్వం వల్ల కలిగేది, రాపిడి వల్ల కలిగేది. వికటత్వం వల్ల కలిగిన చర్మ వికారం రోగ నిరోధక శక్తి ప్రతిక్రియ వల్ల కలుగుతుంది. పదేపదే అలర్జీని కలుగజేసే రసాయనాలున్న శానిటైజర్​ను వాడుతూ ఉంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాపిడి వల్ల కలిగే చర్మ వికారం చర్మంపై పొరను నాశనం చేస్తుంది. కొందరికి ఈ వికారాన్ని తట్టుకునే శక్తి ఉండవచ్చు. కొందరు ఒక సారి రసాయనిక పదార్ధాలను ముట్టుకున్నా సుదీర్ఘకాలం పాటు అలర్జీ కలగవచ్చు.

ఇదీ చదవండి:పట్టణవాసులకు తలనొప్పే పెద్ద సమస్య!

ABOUT THE AUTHOR

...view details