ఏదైనా ప్రమాదంలో కిందపడినా, కాలినా చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. ఏళ్లు గడుస్తున్నా.. కొన్ని అలాగే ఉంటూ అంద విహీనంగా చేస్తాయి. అలాంటివాటిని తొలగించుకోవడానికి ఏవేవో క్రీములు రాసినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే ఓ చిన్నపాటి చిట్కాతో వాటిని తొలగించుకునే విధానం (home remedy for marks on face) చెబుతున్నారు నిపుణులు. అది ఎలాగంటే..
కాలిన గాయాల మచ్చలు పోవాలంటే.. ఇలా చేయండి!
కాలినా, దెబ్బలు తగిలినా శరీరంపై కొన్నిసార్లు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు త్వరగా చర్మంలో కలిపిపోవాలంటే.. సులువైన ఈ ఇంటి చిట్కా (home remedy for marks on face) పాటించండి.
చర్మంపై మచ్చలు
కొంచెం అలోవెరా, కొంచెం వెల్లల్లి తీసుకొని, రెండింటిని మిక్స్ చేసి దంచుకోవాలి. దానిని కొంచెం కొబ్బరినూనెలో వేడి చేసుకొని.. లేపనం రాసుకుంటే ఆ మచ్చలు త్వరగా చర్మంలో కలిసిపోతాయి.
ఇదీ చూడండి:సింపుల్ చిట్కాతో గొంతునొప్పి మాయం!