Home Remedies For Bad Breath : కొందరికి తరచుగా నోటిలో నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనికి ఎన్నో కారణాలుంటాయి. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, తిన్న తరవాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు సరిగ్గా మాట్లాడలేరు. ఈ దుర్వాసన వల్ల పక్కన ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో దుర్వాసనతో పాటు తేన్పులు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా ? ఎటువంటి మౌత్‌వాష్‌లు, లిక్విడ్‌లు లేకుండా కేవలం ఇంట్లో లభించే పదార్థాలతో సహజ పద్ధతిలో నోటి దుర్వాసనను అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు.
నోటి దుర్వాసన పోవడానికి 10 ఇంటి చిట్కాలు :
1. నీళ్లు ఎక్కువగా తాగండి :నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు తరచూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడల్లా, నీటిని తాగాలి. సోడా వంటివి తాగకండి, ఇవి నోటిని మరింత పొడిగా చేస్తాయి.
2. గోరువెచ్చని ఉప్పు నీటితో :ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసనను తరిమికొట్టవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిలో 1/4 నుంచి 1/2 టీస్పూన్ వరకు ఉప్పును కలిపి, 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి.
3. లవంగాలతో :లవంగం నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాన్ని నిధానంగా నమలడం, చప్పరించటం వల్ల దుర్వాసన సమస్యను పరిష్కరించవచ్చు. వీటిని నమలడం వల్ల తాజా శ్వాసను పొందవచ్చు. అలాగే ఇవి నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.
4. ఆపిల్ సైడర్ వెనిగర్ :ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి, ఆ నీటిని 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయండి. దీని వల్ల నోటి దుర్వాసన పోయి.. నోరు ఫ్రెష్‌గా ఉంటుంది.
చేపలు వండినప్పుడు నీచు వాసన వస్తోందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
5. పండ్లు, కూరగాయలు :తాజా పండ్లు, కూరగాయలను రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. యాపిల్స్, సెలెరీ, క్యారెట్లను తినడం వల్ల దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా నాశనమవుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లు లాలాజల ఉత్పత్తిని పెంచి, నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.