తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పీరియడ్స్​ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్​తో రిలీఫ్​ పొందండి! - పీరియడ్స్​

Best Foods to Relief From Period Pain: పీరియడ్స్​ సమయంలో మహిళలకు భరించలేనంత నొప్పి వస్తుంది. ఆ సమయంలో ఈ ఆహార పదార్థాలను మీ డైట్​లో​ తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 12:57 PM IST

Healthy Foods to Relief From Period Pain: పీరియడ్స్ అనేవి మహిళలు ప్రతినెలా ఎదుర్కొనే ఓ సమస్య. ఈ సమయంలో వారికి అసౌకర్యంతో పాటు, పొత్తికడుపులో నొప్పి కూడా ఉంటుంది. అయితే ఈ నొప్పి అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరికి నొప్పి భరించే స్థాయిలోనే ఉంటుంది. మరికొందరికి రుతుస్రావం ప్రారంభమయిన రోజు నుంచి ఐదు రోజుల వరకు భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో కలిగే హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఒత్తిడి, ఆందోళన, చికాకు, అలసట, అసహనంగా ఉంటుంది. ఇంకొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమంది ఈ నొప్పిని భరించలేక మంచానికి పరిమితమవుతారు. కొంతమంది అమ్మాయిలు పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా వాడితే.. పీరియడ్‌ సైకిల్‌, ఒవ్యూలేషన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు వారి ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే.. పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పులు, సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

పసుపు: పసుపులో బయోయాక్టివ్​ కౌంపౌండ్​ కార్​క్యుమిన్​ ఉంటుంది. తినే ఆహారంలో పసుపును కలుపుకుంటే నొప్పి తగ్గుతుంది. అలాగే కొద్దిగా పసుపు తీసుకుని చిన్న టాబ్లెట్​ సైజ్​లో చేసుకుని మంచినీళ్లతో మింగినా రిలీఫ్​ ఉంటుంది.

పీరియడ్స్ టైమ్​లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!

అల్లం: రుతుక్రమంలో వచ్చే నొప్పులను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పీరియడ్స్​ సమయంలో అసౌకర్యాన్ని కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది క్రమం తప్పిన పీరియడ్స్‌ను, రెగ్యులర్‌ చేస్తుంది. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ కారణంగా వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అల్లంలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ విలువలు పుష్కలంగా ఉంటాయి.

డార్క్​ చాక్లెట్​: పీరియడ్స్​ టైం లో నొప్పిని తగ్గించడానికి డార్క్​ చాక్లెట్‌ సహాయపడుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్‌ చాక్లెట్‌లో ఐరన్‌, మెగ్నీషియం ఉంటుంది, ఇది మీ శరీరానికి శక్తినిస్తుంది.

పీరియడ్స్​ కోసం మందులు వాడుతున్నారా? మరిన్ని చిక్కులొస్తాయి - ఇలా సరిచేసుకోండి!

విటమిన్​ సి ఫుడ్​: పీరియడ్స్​ సమయంలో ఎంత వీలైతే అంత విటమిన్​ సి పొందాలి. నెలసరి నొప్పి తగ్గించే.. బెస్ట్‌ ఫుడ్స్‌లో కమలా పండు ఒకటి. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ డి కూడా ఉంటాయి. కమలా పండులోని యాంటీ ఇన్ఫ్లమేషన్‌ గుణాలు పీరియడ్‌ క్రాంప్స్‌ తగ్గించడానికి సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే.. మీ డైట్‌లో కమలా పండ్లు ఎక్కువగా తీసుకోండి.

డ్రైఫ్రూట్స్​: మహిళలు నల్ల ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌ వారి డైట్‌లో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నల్ల ఎండుద్రాక్షలో.. ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో కనిపించే.. టోకోఫెరోల్‌ ఉంటుంది. ఇది పీరియడ్‌ సైకిల్‌ను నియంత్రిస్తుంది.

పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా? ఈ 5 టిప్స్​ పాటిస్తే మీకు ఫుల్​ రిలీఫ్​!

ఆకుకూరలు: ఆకుకూరల్లో ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ పోషకాలు శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియనును వేగవంతం చేస్తాయి. అలసటను దూరం చేస్తాయి, పీరియడ్స్‌ నొప్పిని తగ్గిస్తాయి.

వాటర్​: మంచినీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. పీరియడ్​లో వచ్చే బ్లోటింగ్​ సమస్యను ఇది దూరం చేస్తుంది.

ఓట్స్​: ఓట్స్​లో ఫైబర్​తో పాటు జింక్​, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. వీటితో మెంటల్​ హెల్త్​ మెరుగుపడుతుంది. పెయిన్​ నుంచి రిలీఫ్​ పొంది లైట్​గా ఫీల్​ అవుతారు.

నెలసరి టైమ్​లో కడుపు నొప్పా? వికారంగా ఉంటోందా?.. ఈ టిప్స్ మీ కోసమే!

పీరియడ్స్ టైంలో సెక్స్ చేయకూడదా? ఎవరినీ ముట్టకూడదా?

నెలసరి క్రమం తప్పుతోందా.. కారణమిదే కావచ్చు?

ABOUT THE AUTHOR

...view details