Health tips for cold: చలికాలంలో ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లోనే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. వాటి నుంచి రక్షణ కల్పించే ఆహారం ఇది..
పోషకాల లడ్డూ..
నెయ్యి, డ్రైఫ్రూట్స్, రాగిపిండితో చేసిన లడ్డూలు శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు తగినంత వేడిని, రక్షణను అందిస్తాయి. వీటిని తింటే రోగనిరోధకత పెరుగుతుంది. దాంతో ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వీటి వల్ల పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. దాంతో బరువూ నియంత్రణలో ఉంటుంది. రోజూ ఉదయం పాలతోపాటు ఓ లడ్డూ పిల్లలకూ పెట్టండి. మీరూ తినండి.
ఉసిరి
ఉసిరి. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, ఔషధ సమ్మేళనాలు మెండు. విటమిన్ సి తోపాటు ఐరన్, క్యాల్షియం, పీచు కూడా తగినంత మోతాదులో ఉంటాయి. దీన్ని ఉదయంపూట తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు జీర్ణవ్యవస్థా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్, స్కిన్ హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఉసిరి చట్నీ, జ్యూస్, మురబ్బా.. ఇలా ఏ రూపంలోనైనా తీసుకోండి.