Health Benefits of Nutmeg :మనం డైలీ కూరల్లో వాడే మసాలా దినుసుల్లో.. లవంగం, యాలకులు, ధనియాలు, దాల్చినచెక్క వంటివి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ.. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన జాజికాయను మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. అయితే.. ఈ కాయను తరచూ వంటల్లో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్స్ B1, B6, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఖనిజాలు ఉండే జాజికాయ.. ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. ఇంతకీ.. దీని ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జాయింట్ పెయిన్స్ : జాజికాయలతో తయారుచేసిన నూనెతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, మంట, వాపు నుంచి ఈ నూనెతో ఈజీగా ఉపశమనం పొందవచ్చు. DK హీలింగ్ ఫుడ్స్ ప్రకారం.. జాజికాయతో తయారుచేసిన వాలటైల్ నూనెలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి. దీని వల్ల కీళ్ల, కండరాల నొప్పులు ఈజీగా తగ్గించుకోవచ్చట.
కళ్లకు ఆరోగ్యం :జాజికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి కంటి చూపును అందించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాటరాక్ట్ వంటి కంటి సమస్యలను కూడా నివారిస్తాయి.
బీపీ నియంత్రిస్తుంది : కాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలతో నిండిన జాజికాయ రక్త ప్రసరణను పునరుద్ధరించడానికి, మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా జాజికాయను మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు.
ఒత్తిడి, ఆందోళను కంట్రోల్ చేస్తుంది : DK హీలింగ్ ఫుడ్స్ ప్రకారం.. జాజికాయ మన మెదడు నరాలను ఉత్తేజపరుస్తుంది. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీకి చికిత్స పొందడానికి చాలా బాగ్ హెల్ప్ అవుతుంది. ఒత్తిడి సమయాల్లో ఇది మీ రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడేవారు మీ ఫుడ్లో దీనిని చేర్చుకుంటే ఈజీగా తగ్గించుకోవచ్చు.
ఇది తెలుసా... గోరంత లవంగం కొండంత మేలు!
కాలేయానికి మంచిది :జాజికాయలో అధిక మొత్తంలో మిరిస్లిగ్నాన్ ఉంటుంది. ఇది కాలేయ రుగ్మతలు, గాయాలకు చికిత్స పొందడంలో ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా జాజికాయలో ఉండే పదార్దాలు హెపటైటిస్ వాపులకు ట్రీట్మెంట్ పొందడంలో కూడా సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.