బేకింగ్ సోడా.. వంటింట్లో కనిపించే ఈ పదార్థం(Baking Soda Uses).. అందాన్ని కాపాడటం సహా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు సహాయ పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బేకింగ్ సోడా (Baking Soda Uses) ప్రయోజనాల గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే..
- గ్లాసు నీళ్లలో బేకింగ్ సోడా వేసుకుని రోజు నోరు పుక్కిలిస్తే.. పంటికి ఉన్న టాటర్ అనేది క్రమంగా తొలగిపోతుంది. అంతేకాదు నోటి దుర్వాసన కూడా పోతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసనకు బేకింగ్ సోడా వాడటం ద్వారా చెక్ పెట్టొచ్చు.
- కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ బేకింగ్ సోడాలోని సోడియమ్ బైకార్బొనేట్ ఉపకరిస్తుంది.
- కిమోథెరపీ చికిత్సలో వాడే మందుల ఆమ్ల లక్షణాలను ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. తక్కువ ఆమ్లస్థాయి ట్యూమర్స్ పెరగకుండా వ్యాప్తి చెందకుండా బేకింగ్ సోడా నియంత్రించగలదు.
- దోమకుట్టిన ప్రాంతంలో దద్దుర్లు, దురద, ఎర్రదనం పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దాలి. మూడు వంతుల బేకింగ్ సోడాను ఒకవంతు నీటిలో కలిసి దోమకుట్టిన ప్రదేశంలో రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- నొప్పిని, మంటను తగ్గించే గుణం కూడా బేకింగ్ సోడాకు ఉంది.
- ముఖంపై మచ్చలు ఉన్న వారు.. ముఖాన్ని బాగా కడిగి, మూడు వంతుల బేకింగ్ సోడా, ఒక వంతు నీటితో చేసిన మిశ్రమాన్ని రాసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- ముఖానికే కాదు కేశాలనూ కాపాడుతుంది బేకింగ్ సోడా! మీ షాంపూలో టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వెంట్రుకలకు పట్టిస్తే.. ఇతర స్పేయర్లు, జెల్స్, కండీషనర్లు చేయలేని అద్భుతాన్ని చేసి చూపిస్తుంది.