కరోనా కారణంగా చాలారోజుల విరామం తర్వాత వ్యాయామాలు మొదలుపెట్టేవాళ్లు వాటి తీవ్రత స్థాయిని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి తప్ప, మొదటిరోజునుంచే ఒకప్పటి స్థాయిలో శరీరాన్ని శ్రమ పెట్టడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
మీరు వ్యాయామం మళ్లీ మొదలుపెట్టారా? - వ్యాయామంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు మళ్లీ వ్యాయామం మొదలు పెట్టారా... అయితే వ్యాయామం ఎప్పుడు చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనే అంశాలపై నిపుణులు కొన్ని జాగ్రత్తలు తెలిపారు.
మొదటిరోజున ఒకప్పటి మీ రెగ్యులర్ వ్యాయామ తీవ్రతలో 50 శాతానికి మించకుంటే మేలు. ఇదివరకు రోజూ అయిదు కి.మీ. నడిచినవాళ్లు ఇప్పుడు 2-2.5కి.మీ.తో మొదలుపెట్టాలి. అదీ మునుపటంత వేగంగా కాదు సుమీ. వ్యాయామాలకి బ్రేక్ పడింది కాబట్టి కండరాల్లో బలం తగ్గుతుంది. అందుకే ముందు చిన్నచిన్నగా కండర సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎక్కువసేపు కూర్చొని ఉండటంవల్ల వెన్నెముకలో కండరాలు బిగుతుగా ఉంటాయి. వాటిని ఉన్నపళంగా స్ట్రెచ్ చేయకూడదు. ఏదైనా భాగంలో నొప్పిగా, ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వ్యాయామాలు ఆపేయాలి. వ్యాయామ తీవ్రతను క్రమంగా పెంచుతూ 21వ రోజుకి మునుపటి స్థాయిలో చేయొచ్చు.