Pain in Hand While Typing Relief Tips :మనమున్న ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్ లేనిదే నడవదు. ఇందులో కీబోర్డు కూడా ఒక భాగమే. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టైపింగ్ సంబంధించిన రంగం వాళ్లు ఈ కీ బోర్డును వారు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆఫీసు పనంతా దీనితోనే జరుగుతుంది. ఈ టైపింగ్ చేసే సమయంలో కొందరికి విపరీతమైన నొప్పి కలుగుతుంది. మీరు కూడా టైప్ చేస్తున్నప్పుడు చేతి నొప్పిని అనుభవిస్తున్నారా ? దాన్ని తగ్గించుకోవడానికి 6 మార్గాలున్నాయి.
కీబోర్డ్ టైపింగ్ నొప్పి ఎందుకు ప్రమాదకరం?
How To Relieve Pain in Hands From Typing :సంప్రదాయ కీబోర్డ్‌లను ఎర్గోనామిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేయలేదు. వీటిల్లో కీస్ అస్థిరంగా ఉంటాయి. టైప్ చేసేటప్పుడు మీ వేళ్లను అటు ఇటు జరపాల్సి ఉంటుంది. కాబట్టి దీని వల్ల మీకు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే వ్యాధి పెరగడం, నరాలు దెబ్బతినటం లాంటివి జరుగుతాయి. మీరు టైప్ చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకండి. ఆ నొప్పిని తగ్గించడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి
1. సీటు ఎత్తును అడ్జస్ట్ చేయడం..
మంచి పొజిషన్‌లో టైప్ చేయడానికి ముఖ్యమైన విషయాల్లో మీ సీటు ఎత్తు కూడా ఒకటి. ఇది సరిగ్గా ఉంటే.. చేతులు పక్కకు జరపకుండా, వేళ్లు కీబోర్డ పై తటస్థ స్థానంలో ఉంటాయి. దీంతో పాటు ముంజేతులు టేబుల్‌ను తాకాలి. కుర్చీ తక్కువ ఎత్తులో ఉంటే.. అలా చాలా సేపు కూర్చుంటే భుజాలపై భారం పడి నొప్పి వస్తుంది. కుర్చీ ఎత్తును అడ్జస్ట్ చేయడం వల్ల ఈ బాధ లేకుండా చూసుకోవచ్చు. ఒక వేళ అడ్జస్టబుల్ ఛైర్ లేకుంటే.. దిండు లేదా ఇతర వాటితో ఎత్తు పెంచుకోండి.
2. మణికట్టు నొప్పి ఉపశమన వస్తువు కొనుగోలు..
టైపింగ్ చేసేటప్పుడు బ్యాక్ స్పేస్ లేదా ఎంటర్ కొట్టేటప్పుడు మణికట్టును ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. ఇది ఎక్కువైతే అక్కడ నొప్పి వస్తుంది. మరోవైపు కొన్ని కీ బోర్డులు ఎక్కువ ఎత్తులో ఉండటమూ దీనికి కారణం. దీన్ని నివారించడానికి wrist rest అనే వస్తువు పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది ఎత్తుగా ఉన్న కీబోర్డ్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. మణికట్టు స్థానాన్ని మార్చడం..
టైపింగ్ సమయంలో నొప్పికి మణికట్టు స్థానమూ ఒక కారణమే. మణికట్టు స్థానాన్ని మార్చడం అంత సులభం కాదు. కానీ రోజూ ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. ఈ క్రమంలో టైపింగ్ వేగం తగ్గుతుంది కానీ ఫలితముంటుంది. మీ మణికట్టును వీలైనంత నిటారుగా ఉంచి టైపింగ్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి శిక్షణ ఇవ్వడం కోసం టైపింగ్ ప్రాక్టీస్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి.