Hair Loss tips Telugu : ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు రాలడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎవరిని చూసినా సరే.. జుట్టు రాలుతోందని బాధపడుతూ ఉంటారు. రాలకుండా ఏం చేయాలనేది తెలియక సతమతమవుతూ ఉంటారు. ఎందుకు జుట్టు రాలుతుందో కారణం తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. కొంతమందికి జుట్టు ఎక్కువగా రాలి బట్టతల వస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలో కనిపించేందుకు కూడా చాలా సిగ్గుగా భావిస్తూ ఉంటారు.
Hair fall solution : మామూలుగా తలస్నానం చేసినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలుతాయి. కానీ తల దువ్వుకునేటప్పుడు దువ్వెనకు చుట్టుకుని రావడం లేదా బెడ్‌పై పడుకున్నప్పుడు తల వెంట్రుకలు మంచంపై పడటం చూసి జుట్టు ఎక్కువగా రాలుతుందని గమనిస్తారు. దీంతో రోజూ జుట్టు రాలడాన్ని చూసి భయపడుతూ ఉంటారు. తమకు ఏదో అయిందని, అందుకే జుట్టు ఊడిపోతుందని ఆందోళన పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
చేమ దుంప రసం
చేమ దుంపల రసంతో జుట్టు రాలడాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చేమ దుంపల రసాన్ని కొన్ని రోజుల పాటు రోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. వెంట్రుకలు రాలిపోకుండా వాటికి శక్తినిచ్చే లక్షణాలు చేమ దుంప రసంలో ఉన్నాయి. దీంతో దానిని రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
మందార పువ్వులతో ఇలా చేయండి
ఇక కొబ్బరిపాలల్లో నిమ్మరసం కలిపి తలకు రాసుకోవాలి. తలకు బాగా పట్టించిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా కొద్దిరోజుల పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇక మందార పువ్వులను కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెలో వేసి కాల్చిన తర్వాత తలకు పట్టించాలి. గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
పప్పు దినుసులు, బాదం ఎక్కువగా తీసుకోండి
Hairfall control foods : మాంసకృతులు ఎక్కువగా ఉండే మంచి ప్రొటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య రాదు. పప్పు దినుసులు, బాదం, ఎగ్స్, చేపలు, చికెన్, మటన్ వంటి వాటిల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టుకు ఎలాంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.
ధ్యానం, గ్రీన్ టీ వల్ల ప్రయోజనం
బాగా ఒత్తిడికి గురి కావడం వల్ల జుట్టు రాలుతుంది. దీంతో ధాన్యం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆలీవ్ ఆయిల్‌తో జుట్టు రాలే సమస్యకు పరిష్కారం
ఆలీవ్ ఆయిల్ జట్టు రాలడాన్ని వెంటనే తగ్గిస్తుంది. గోరువెచ్చని ఆలీవ్ ఆయిల్‌ను జుట్టుతో పాటు జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి కొద్దిసేపు వేచి ఉండాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల లాభం ఉంటుంది. అలాగే ఆలీవ్ ఆయిల్‌ను రాత్రిపూట రాసుకుని ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేయడం వల్ల కూడా లాభం ఉపయోగం ఉంటుంది. వారానికి రెండుసార్లు ఆలీవ్ ఆయిల్‌తో ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాక జుట్టు పెరుగుతుంది.
జుట్టు రాలే సమస్యకు ఇంటి చిట్కాలు