కొవిడ్-19 ప్రభావం కేవలం శ్వాస వ్యవస్థమీదే కాదు, మెదడు మీదా ఉంటోంది. ఎందుకంటే- సార్స్-కోవ్2 కేంద్ర నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపడం వల్ల రుచి, వాసన, తలనొప్పి, అలసట, వికారం... వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై లోతుగా పరిశీలించగా- ఈ వైరస్ ఆర్‌ఎన్‌ఏ జాడలు మెదడు, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లలోనూ కనిపించాయట. దాంతో అది మెదడులోకి ఎలా వెళ్లిందనే దానిమీద జర్మనీలోని ఛారిటె యూనివర్సిటీ నిపుణులు పరిశీలించగా- ముక్కుకీ గొంతుకీ మధ్యలో ఉన్న నాసోఫ్యారింక్స్ ద్వారా అది లోపలకు వెళుతున్నట్లు గుర్తించారు.
శ్వాస వ్యవస్థమీదే కాదు... మెదడులో కొవిడ్-19? - తెలంగాణ వార్తలు
కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపైనే కాదు మెదడు మీద ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. అత్యధిక శాతం వైరస్ ముక్కులోని మ్యూకస్ పొరల్లోని నాడీ కణాల్లో చేరుతుందట. అక్కడి నుంచే మెదడులో వాసన, రుచుల్ని తెలిపే నాడీకేంద్రాలకు చేరి ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు.
ఈ విషయమై వీళ్లు కొవిడ్‌తో మరణించిన 33 మంది రోగుల్ని నిశితంగా పరీక్షించారట. అదెలా అంటే- అత్యధిక శాతం వైరస్ ముక్కులోని మ్యూకస్ పొరల్లోని నాడీ కణాల్లో చేరుతుందట. అక్కడి నుంచే మెదడులో వాసన, రుచుల్ని తెలిపే నాడీకేంద్రాలకు చేరి ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. మరికొందరిలో ఈ వైరస్ శ్వాసకోశ, హృద్రోగ వ్యవస్థల్ని నియంత్రించే మెడుల్లా భాగంలోకీ చేరుతుందట. అందుకే కొందరిలో ఆకస్మిక మరణాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకుల అభిప్రాయం.
ఇదీ చదవండి:'వచ్చే ఏడాది సరికొత్త శిఖరాలను అధిరోహిస్తాం'